అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. తోడబుట్టిన సొంత చెల్లెలుపై ఓ అన్న  అత్యాచారానికి పాల్పడ్డాడు. వావివరసలు మర్చిపోయి... రక్తం పంచుకు పుట్టిన  చెల్లిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ధర్మవరం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి బేల్దారి వృత్తి చేసుకుంటున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. అందులో మొదటి భార్య, ఆమె కుమారుడు పట్టణంలో నివసిస్తున్నారు. రెండో భార్య, ఆమె కుమార్తె కొత్త చెరువులో నివసిస్తున్నారు. కాగా... బేల్దారి పనిచేసుకునే వ్యక్తి  ఇటీవల తన రెండో భార్యను తీసుకొని జీవనోపాధి కోసం బెంగళూరు వెళ్లాడు.

కాగా... అతని కుమార్తె ప్రతి రోజు ధర్మవరం బట్టల దుకాణంలో పనిచేసి తిరిగి రాత్రికి కొత్త చెరువుకి వెళ్లేది. ఇటీవల ఆమె దుకాణానికి వెళ్లి వస్తుండగా... సవతి తల్లి కొడుకు ఎదురయ్యాడు. మాయమాటలు చెప్పి.. వాళ్ల ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సొంత అన్న చేసిన పనికి ముందు షాకయిన యువతి... తర్వాత తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశారు. కాగా... నిందితుడికి వివాహమైందని.. భార్యతో గొడవై దూరంగా ఉంటోందని దర్యాప్తులో తేలింది.