టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కరణం బలరాం ఇంట్లోని ఫర్నీచర్ తో పాటు కొన్ని కీలక ఫైళ్లు కూడా ధ్వంసమయ్యాయి. విద్యుదాఘాతం కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. స్వల్ప ఆస్తి నష్టం చోటుచేసుకోగా... ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే విషయంపై క్లారిటీ రాలేదు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.