'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఆదర్శంగా లేదని.. ఈ క్యారెక్టర్ కారణంగా ప్రేక్షకులు తప్పుదారి పట్టే ఛాన్స్ ఉందంటూ కొందరు చిత్రబృందాన్ని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ పెట్టారు. అవి చూసిన హీరో రామ్ తాజాగా కొన్ని కామెంట్స్ పెట్టాడు.

'హీరో హెల్మెట్‌ పెట్టుకోలేదు. హీరో పొగతాగుతున్నాడు. హీరో అమ్మాయిలకి గౌరవం ఇవ్వట్లేదు. ఎంతసేపు ఇవేకానీ.. అక్కడ హీరో అడ్డం వచ్చినవాళ్లని చంపేస్తున్నాడు అని ఒక్కరూ కంప్లైంట్ చేయడం లేదు. జీవితానికి విలువ లేదు!.. చాలా బాధాకరం' అని పోస్ట్ పెట్టాడు.

'గిది సినిమారా భాయ్.. సీన్ చూడండి.. సీన్ చేయొద్దు' అంటూ సినిమాలో తన క్యారెక్టర్ స్టైల్ లో నెటిజన్లకు బదులిచ్చాడు. ఇది చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్ బాగా చెప్పావ్  అన్నట్లు ఎమోజీలు షేర్ చేశారు.

'ఇస్మార్ట్ శంకర్'లో రామ్ హైదరాబాద్ కి చెందిన మాస్ కుర్రాడిగా కనిపించారు. నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లు గా నటించారు. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.48 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.