హైదరాబాద్: హైద్రాబాద్ ఆబిడ్స్‌లో  స్వప్న, సంతోష్ థియేటర్‌ నుండి నాలుగేళ్ల చిన్నారి కిందపడి మృతి చెందాడు.హైద్రాబాద్ ఆబిడ్స్‌లో స్వప్న సంతోష్ థియేటర్‌లో ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో లయన్ సినిమా చూసేందుకు సోమవారం సాయంత్రం స్వప్న సంతోష్ థియేటర్ కు వచ్చాడు.

అయితే  చిన్నారి కిట్టు థియేటర్ మొదటి అంతస్తులో ఆడుకొంటున్న సమయంలో రక్షణ లేని కిటికీ నుండి చిన్నారి కిట్టు కిందపడిపోయాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్సి పొందుతూ చిన్నారి కిట్టు మంగళవారంనాడు సాయంత్రం మృతి చెందాడు.

సినిమా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే  ఈ ప్రమాదం వాటిల్లిందని ప్రవీణ్ ఆరోపించారు. తన కొడుకు మృతికి కారణమైన సినిమా థియేటర్ పై చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ డిమాండ్ చేస్తున్నారు.