అమరావతి: అమరావతి ప్రాజెక్టు నుండి మరో బ్యాంకు వైదొలిగింది. అమరావతి ప్రాజెక్టు నుండి ప్రపంచ బ్యాంకు వైదోలిగిన వారం రోజులకే చైనాకు చెందిన బ్యాంకు వెనక్కు తగ్గింది.

అమరావతి ప్రాజెక్టు నిర్మాణం విషయమై పలువురు రైతులు ప్రపంచ బ్యాంకు కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో  ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకూడదని  ప్రపంచ బ్యాంకు నిర్ణయం తీసుకొంది.  

ఈ నిర్ణయం తీసుకొన్న వారం రోజులకే చైనాకు చెందిన ఆసియా మౌళిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు కూడ అమరావతి ప్రాజెక్టు నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది.  అమరావతి ప్రాజెక్టు కోసం చైనాకు చెందిన ఈ బ్యాంకు 200 మిలియన్ డాలర్లు ఇవ్వాలని భావించింది.

ప్రపంచ బ్యాంకుతో కలిసి చైనా బ్యాంకు ఈ రుణం ఇవ్వాలని ప్లాన్ చేసింది. అయితే  అమరావతి ప్రాజెక్టు నుండి   ప్రపంచబ్యాంకు వైదొలగడంతో చైనా బ్యాంకు కూడ అమరావతి ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పింది.  

అమరావతి ప్రాజెక్టు విషయంలో ప్రపంచ బ్యాంకు నుండి వచ్చిన నివేదికలపై చంద్రబాబు సర్కార్ సరిగా స్పందించలేదని వైఎస్ జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు సర్కార్ హయంలో తీసుకొన్న నిర్ణయాల కారణంగానే  ప్రపంచబ్యాంకు అమరావతి నుండి వైదొలిగినట్టుగా  జగన్ సర్కార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అంతా వైసీపీ వల్లే: అమరావతి ప్రాజెక్టు నుంచి వరల్డ్ బ్యాంక్ తప్పుకోవడంపై బాబు

జగన్‌కు షాక్: అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్‌బ్యాంక్

అమరావతి నిర్మాణానికి బ్రేకులు: ప్రపంచబ్యాంకు కొర్రీ