Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌‌కు షాక్: మున్సిపల్ బిల్లును వెనక్కి పంపిన గవర్నర్

మున్సిఫల్ బిల్లును గవర్నర్ నరసింహాన్ తిప్పి పంపారు. ఈ నిర్ణయం కేసీఆర్ సర్కార్ కు షాక్ గురి చేసింది.ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

governor narasimhan returned municipal bill
Author
Hyderabad, First Published Jul 23, 2019, 12:17 PM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహాన్ షాకిచ్చారు. మున్సిఫల్ బిల్లును వెనక్కి పంపారు. విపక్షాల అభ్యంతరంపై గవర్నర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. 

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మున్సిపల్ బిల్లును గవర్నర్ నరసింహాన్‌ తిప్పి పంపారు. కొత్త మున్సిపల్ బిల్లు కోసం ఈ నెల 18,19 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించింది.

ఈ సమావేశాల్లో కొత్త బిల్లును సభ ఆమోదించింది. అయితే ఈ బిల్లును గవర్నర్ నరసింహన్ తిప్పి పంపారు.  కొత్త బిల్లులో కలెక్టర్లకు సర్వాధికారాలు  కల్పించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్లకు ఈ బిల్లు ద్వారా విస్తృతమైన అధికారాలు కల్పించడంపై  విపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో ఈ బిల్లును గవర్నర్ నరసింహాన్ వెనక్కి పంపినట్టుగా చెబుతున్నారు.

దీంతో సవరణలతో కేసీఆర్ సర్కార్ ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios