'బిగ్ బాస్3' కంటెస్టంట్స్.. వీళ్ల గురించి ఈ విషయాలు తెలుసా..?

First Published 23, Jul 2019, 12:42 PM

బుల్లితెర నెంబర్ 1 రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తాజాగా మూడో సీజన్ కూడా మొదలైంది. 

బుల్లితెర నెంబర్ 1 రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తాజాగా మూడో సీజన్ కూడా మొదలైంది. 15 మంది కంటెస్టంట్ లుగా పాల్గొన్నారు. వారిలో శ్రీముఖి, హేమ, టీవీ 9 జాఫర్ ఇలా కొంతమంది కంటెస్టంట్స్ గురించి తెలిసిందే. అయితే కొందరి గురించి మాత్రం అంతగా ఐడియా ఉండదు. అందుకే వారి గురించి మీకు తెలియని కొన్ని విషయాలేంటో ఇప్పుడు చూద్దాం!

పునర్నవి భూపాలం - 1996లో విజయవాడలో పుట్టిన ఈమె 'ఉయ్యాలా జంపాల' చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసింది. 2012లో ఈ బ్యూటీ 'ఫ్రెష్ ఫేస్ ఆఫ్ విజయవాడ' అనే అవార్డుని గెలుచుకుంది. 17 ఏళ్లకే ఈమె సినిమాల్లోకి వచ్చేసింది. ఈమె సైకాలజీ కోర్సు పూర్తి చేసింది.

రాహుల్ సిప్లిగుంజ్ - 'రంగస్థలం', 'లై' వంటి చిత్రాల్లో హిట్ సాంగ్స్ పాడారు రాహుల్. అంతేకాదు.. యూట్యూబ్ ఆయన రూపొందించిన మాక్కిరికిరి, సావత్, మంగమ్మ లాంటి సాంగ్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి.

అలీ రాజా - హైదరాబాద్ కి చెందిన ఈ మోడల్ పసుపు కుంకుమ, మాటేమంత్రము లాంటి డైలీ సీరియల్స్ లో నటిస్తున్నాడు. బుల్లితెరపై అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించాడు. తెలుగులో 'దృవ' సినిమాలో మెరిశాడు.

రవికృష్ణ - టీవీ సీరియల్స్ లో రవి బాగా ఫేమస్. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటిస్తున్నాడు. విజయవాడకి చెందిన రవి 2018కి గాను 'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆన్ టెలివిజన్' అవార్డు గెలుచుకున్నాడు.

అషు రెడ్డి - డబ్ స్మాష్ లతో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీని సమంతతో పోలుస్తుంటారు. ఇప్పుడు కాస్త లావైనప్పటికీ అప్పట్లో మాత్రం సమంతలానే ఉండేది. పవన్ కళ్యాణ్ కి ఈమె వీరాభిమాని. పవన్ నిర్మించిన 'ఛల్ మోహన రంగ' సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించింది.

టీవీ 9 జాఫర్ - రాజకీయ నాయకుల నుండి సెలబ్రిటీల వరకూ అందరికీ తన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ వాళ్లతో నిజాలు చెప్పించడానికి ప్రయత్నించే రిపోర్టర్ జాఫర్. ఈయన చేసే ఇంటర్వ్యూలకి చాలా పాపులారిటీ ఉంది.

హిమజా రెడ్డి - విజయవాడకి చెందిన ఈమె తెలుగులో 'నేను శైలజ', 'మహానుభావుడు' వంటి చిత్రాల్లో నటించింది. అలానే కొన్ని సీరియల్స్ కూడా నటించింది. చదువు విషయానికొస్తే.. విజయవాడలోనే MBA పూర్తి చేసింది.

మహేష్ విట్టా - ఫన్ బకెట్ అనే యూట్యూబ్ సిరీస్ లో తన మాటలతో అందరినీ మెప్పించిన మహేష్ సొంతూరు ప్రొద్దుటూరు. నటుడిగా ఇండస్ట్రీకి రాకముందు MCA పూర్తి చేశాడు. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కమెడియన్ గా తనను తను నిరూపించుకోవాలనుకుంటున్నాడు.

రోహిణి - వైజాగ్ కి చెందిన రోహిణి అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసింది. సీరియల్స్ లో నటిస్తోన్న ఈమె రాయలసీమ స్లాంగ్ తో కమెడియన్ గా మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది.

బాబా భాస్కర్ - తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో పాటలకు కోరియోగ్రఫీ చేసిన ఈయన గురించి అందరికీ తెలిసిందే.

హేమ - తెలుగులో వచ్చే అన్ని సినిమాల్లో దాదాపు హేమ కనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, కామెడీ పాత్రలకు ఈమె చాలా ఫేమస్. ఈమెను ఫైర్ బ్రాండ్ అని కూడా అంటుంటారు. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచింది.

శివజ్యోతి - మనలో చాలా మందికి ఈమె పేరు శివజ్యోతి అని కూడా తెలియదు. 'తీన్మార్' వార్తలతో సావిత్రిగా ఫేమస్ అయిన ఈమె అసలు పేరు కూడా సావిత్రి అనే అనుకుంటారు. బిగ్ బాస్ షోలోకి మొదటి కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె చివరి వరకు ఉంటుందేమో చూడాలి!

శ్రీముఖి - బుల్లితెరపై యాంకర్ గా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. కొన్ని సినిమాలు కూడా నటించింది. షోలోకి అడుగుపెట్టకముందే శ్రీముఖి కోసం ఆర్మీలు తయారయ్యాయి.

వరుణ్ సందేశ్, వితికా షేర్ - బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన మొదటి కపుల్ వీళ్లే. వరుణ్ 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారులోకం' వంటి చిత్రాల్లో నటించిన వరుణ్ కి ప్రస్తుతం అవకాశాలు లేవు. వితికా కూడా నటిగా కొన్ని సినిమాలు చేసింది.

loader