న్యూఢిల్లీ:  కాశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మధ్యవర్తిత్వం వహించాలని ప్రధానమంత్రి మోడీ అభ్యర్ధించినట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో విపక్షాలు మోడీ ప్రకటన కోసం  పట్టుబట్టాయి.

కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు మోడీ తనను కోరారని ట్రంప్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం  కోరారని ట్రంప్ వ్యాఖ్యలు చేయడంతో  ఈ విషయమై మోడీ ప్రకటన చేయాలని  విపక్షాలు పట్టుబట్టాయి.

ఈ ప్రకటనతో సభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ విషయమై విపక్షాలు ఆందోళన చేశాయి. మరో వైపు రాజ్యసభలో ఈ విషయమై మంత్రి స్పష్టత ఇచ్చారు.

ఇలాంటి ప్రతిపాదన  చేయలేదని  రాజ్యసభలో మంత్రి జయశంకర్ ప్రకటించారు. కాశ్మీర్ విషయమై ట్రంప్ ను మధ్యవర్తిత్వం వహించాలని కోరలేదని ఆయన వివరణ ఇచ్చారు.లోక్‌సభలో కూడ ఇదే విషయమై వపిక్షాలు మోడీ సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. దీంతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత వార్తలు

ఇలా పరిష్కారం కాదు: కాశ్మీర్ పై ఇమ్రాన్ మెలిక

కాశ్మీర్‌పై ట్రంప్ వివాదాస్పదం: ఖండించిన భారత్