Asianet News TeluguAsianet News Telugu

మార్వెల్‌ స్కెచ్చా మజాకా! ‘అవతార్‌’ రికార్డ్ ఎగిరిపోయింది!

ట్రేడ్ లెక్కల ప్రకారం...ఇన్నాళ్లూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ల వసూళ్ళు చేసిన చిత్రంగా ‘అవతార్‌’ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ దాన్ని ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తాజాగా బీట్‌ చేసి, హిస్టరీ క్రియేట్ చేసింది. 

Avengers Endgame Beats Avatar Box Office Record
Author
Hyderabad, First Published Jul 23, 2019, 3:50 PM IST

కలెక్షన్స్ యుద్దాలు మనకే కాదు హాలీవుడ్ లోనూ భారీగానే జరుగుతాయి. ఏ సినిమా హైయిస్ట్ కలెక్ట్ చేసింది అనేది ఎప్పటికప్పుడు రికార్డ్ గా రికార్డ్ అవుతూనే ఉంటుంది. మీడియా మాట్లాడుతూనే ఉంటుంది. దాంతో సిని నిర్మాణ సంస్దలు ఆ రికార్డ్ కోసం పోటీ పడుతూంటారు. అందుకోసం రకరకాల స్కెచ్ లు కూడా వేస్తూంటారు. ఇప్పుడు అదే విధంగా ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ప్రపంచ బాక్సాఫీస్‌ విజేతగా మారింది. 

ట్రేడ్ లెక్కల ప్రకారం...ఇన్నాళ్లూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ల వసూళ్ళు చేసిన చిత్రంగా ‘అవతార్‌’ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ దాన్ని ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తాజాగా బీట్‌ చేసి, హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రముఖ దర్సకుడు జేమ్స్‌ కామెరూన్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘అవతార్‌’ ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్‌ డాలర్లు రాబట్టి అప్పట్లో సంచలనమైంది. 

2009లో వచ్చిన ఈ సినిమాని బీట్ చేయగలిగే సినిమా ఇప్పటిదాకా రాలేదు.  ఇప్పటికీ వసూళ్లు పరంగా నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంది. అయితే పెద్ద పెద్ద సంస్దల కన్ను ఆ సినిమాపైనే ఉంది. ప్రతీ సారి ఆ సినిమాతోనే కలెక్షన్స్ పరంగా పోటీ పెట్టుకునే వారు.  అయితే దగ్గరకు కూడా రీచ్ కాలేదు. 

కానీ ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఈ రికార్డును దాటే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు మొదట అంచనా వేశారు. అనుకున్నట్లే సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. 2.79 బిలియన్‌ డాలర్లు రాబట్టి ‘అవతార్‌’ రికార్డును చెరిపేసింది. అంతేకాదు ఈ సినిమా చైనా, భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది.

అందుకు కారణం మార్వెల్ సంస్ద బిజినెస్ స్టాటజీనే. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ కలెక్షన్స్‌ మరింత పెంచాలనే ఉద్దేశంతో మార్వెల్‌ స్టూడియోస్‌ అదనపు సీన్స్ కలిపి రెండోసారి గత నెల 28న థియేటర్లలో విడుదల చేసింది. ఊహించినట్లే సినిమా ఇప్పుడు కలెక్షన్స్‌ పరంగా నెంబర్ వన్ ప్లేస్  దక్కించుకుంది. ‘అవతార్‌’ రెండో స్థానంలో చేరింది. ఈ సందర్భంగా ‘అవతార్‌’ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ మార్వెల్‌ స్టూడియోస్‌కు విషెష్ తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios