Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పస్టం చేసింది.

karnataka crisis:Floor Test Will Take Place by End of Day, Speaker Tells Supreme Court
Author
Bangalore, First Published Jul 23, 2019, 1:15 PM IST

న్యూఢిల్లీ:  కర్ణాటక అసెంబ్లీలో  విశ్వాస పరీక్షలో  తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇవాళ బలపరీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. రెబెల్స్ పిటిషన్‌పై  విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

మంగళవారం నాడు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఇవాళే అసెంబ్లీలో బల పరీక్ష చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును కోరారు.

ఈ తరుణంలో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే స్పీకర్ రమేష్ కుమార్ విశ్వాస పరీక్షను వాయిదా వేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది తీసుకొచ్చారు. 

బలపరీక్షపై చర్చ జరుగుతున్న సమయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇవాళ బల పరీక్ష పూర్తి కాకపోతే ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేస్తామని  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
 

సంబంధిత వార్తలు

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

Follow Us:
Download App:
  • android
  • ios