చంద్రయాన్-2 సక్సెస్: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 22, 2019, 6:50 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

కర్ణాటక లైవ్‌ అప్‌డేట్స్: స్పీకర్‌తో కుమారస్వామి భేటీ

రాత్రి 7 గంటలకు గవర్నర్ వాలాను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. బలనిరూపణకు ముందే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమార స్వామి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 

బిగ్ బాస్ సెన్సార్ చేయాలంటూ పిటిషన్... విచారణ వాయిదా

బ్రాడ్ కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా షో ప్రసారం చేస్తున్నారని... దీనిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 

నాలుగు మూలలా నాలుగు చెరువులు...చింతమడక వాస్తు అద్భుతం: కేసీఆర్

రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రారంభించిన రోజు తన జీవితంలో ఎంతో సంతోషించానన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మంగళవారం ఆయన తన స్వగ్రామం చింతమడకలో పర్యటిస్తున్నారు.

 

అవగాహన లేకుండా ఏవేవో చెప్తావ్, ఆ యాక్ట్ గురించి తెలుసా.? : మంత్రి అనిల్ పై లోకేష్ సెటైర్లు

అమరావతి: భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నిప్పులు చెరిగారు మాజీమంత్రి నారా లోకేష్. ఇరిగేషన్ మంత్రికి ఏం అంశంపైనా అవగాహన లేదని విమర్శించారు. 60సి నిబంధన అంటే ఏమిటో మంత్రి అనిల్ కుమార్ కు ఏమైనా తెలుసా అంటూ మండిపడ్డారు.

 

నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 (వీడియో)

నెల్లూరు: చంద్రయాన్ -2  సోమవారం నాడు ప్రయోగించారు. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుండి  జీఎస్ఎల్‌వీ- మార్క్3 ఎం1 నింగిలోకి దూసుకెళ్లింది.

 

నేను 'బిగ్ బాస్'కు వచ్చింది అందుకే.. ఫుల్ క్లారిటీతో యాంకర్ శ్రీముఖి!

దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువత ఎక్కువగా ఈ షోని ఫాలో అవుతున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 3 తెలుగు ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. తొలిరోజే కింగ్ నాగార్జున అదరగొట్టేశారు. \

 

కూర్చోవడానికి అమరావతి, రాజ్ భవన్ లు ఉన్నాయంటే అది మావల్లే : చంద్రబాబు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పనికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని భూములకు సంబంధించి ఎన్నో కేసులు వేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 
 

 

తీన్మార్ సావిత్రి రాజీనామా.. బిగ్ బాస్ కు వెళ్లక ముందే వివాదం ?

ప్రముఖ ఛానల్ లో తీన్మార్ సావిత్రిగా యాంకర్ శివజ్యోతి పాపులర్ అయింది. బిత్తిరి సత్తితో కలసి సావిత్రి చేసే సరదా న్యూస్ ప్రజంటేషన్ అందరిని ఆకట్టుకుంది. ఆదివారం రోజు ప్రారంభమైన బిగ్ బాస్ షోలో సావిత్రి తొలి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. 

 

1.40లక్షల ఉద్యోగాల భర్తీ:మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి:  రాష్ట్రంలో 1.40 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.  రాత పరీక్ష ద్వారానే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

 

నేను దేనికైనా సిద్ధమే.. నువ్వు సిద్ధమా...?: బుగ్గనకు మాజీసీఎం చంద్రబాబు సవాల్

అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర రాజధాని అమరావతికి నిధులు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గడంపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని విరుచుకుపడ్డారు. 

 

అసెంబ్లీలో టీడీపీ దూకుడు: స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు

వియ్ వాంట్ జస్టిస్ అంటూ నిరసన తెలిపింది. బీసీ, ఎస్సీలకు న్యాయం జరుగుతుంటే టీడీపీ ఓర్వలేకపోతుందంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీలకు మంచి జరుగుతుంటే టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందని ఇది దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. 

 

చంద్రయాన్ 2 సక్సెస్.. ప్రభాస్ రెస్పాన్స్ ఇదే.. రాజమౌళి గర్వించేలా!

యావత్ భారతావని ఎదురు చూసిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్ నుంచి చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే జరిగిన ఈ ప్రయోగాన్ని అభినందిస్తూ ప్రముఖులంతా ట్వీట్స్ చేస్తున్నారు. 

 

ఆంటీతో ప్రేమలో రాజ్ తరుణ్..ఫ్యామిలీ లో చిచ్చే

సినిమావాళ్లు ఎప్పుటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో రాకపోతే ప్రేక్షకులు పట్టించుకోవటం లేదు. రొటీన్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ లాంటి  చిన్న హీరోల సినిమాల పరిస్దితి అయితే మరీ దారుణం. కాన్సెప్టే అక్కడ కింగ్  అయ్యిండాల్సిన పరిస్దితి. 

 

12అడుగుల గుంతలో పడిన ఆవు... మూడురోజులు నరకం

మూడు రోజుల క్రితం ఓ ఆవు ఆహారం కోసం గడ్డిమేస్తూ.. నాగోల్ లోని ఓ 12 అడుగుల గుంతలో పడిపోయింది. అక్కడి నుంచి బయటకు రాలేక నానా అవస్థలు పడింది.ఆవు పరిమాణంలో పెద్దగా ఉండటంతో.. బటయకు తీయడానికి కూడా ఎవరూ సాహసం చేయలేకపోయారు.

 

సెంట్రల్ యూనివర్శిటి స్టూడెంట్ దీపిక అనుమానాస్పద మృతి

హైదరాబాద్: హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దీపిక అనే విద్యార్ధిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బాత్‌రూమ్ లో ఆమె మృతదేహన్ని సహచర విద్యార్థినులు గుర్తించారు.

 

ఈ ఏడాది వర్షాలకు లోటు లేదు: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరలో అత్యంత కీలకఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది.

 

ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలి, లేకపోతే కోర్టుకు: గాలి జనార్ధన్ రెడ్డి

హైదరాబాద్: ఆస్తుల అటాచ్ మెంట్ విషయంలో కోర్టు తీర్పును అధికారులు అమలు చేయడం లేదని  గాలి జనార్ధన్ రెడ్డి  చెప్పారు. ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

 

చేదు నిజం.. ఆ 132 గ్రామాల్లో ఒక్క అమ్మాయి కూడా పుట్టలేదు

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాల్లోని 132 గ్రామాల్లో గత మూడు నెలలుగా ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదు. గత మూడు నెలల్లో మొత్తం 216మంది జన్మించగా.. అందులో ఒక్కరు కూడా ఆడపిల్ల లేకపోవడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేసింది.

 

పెళ్లి చేసుకుంటానంటేనే ఒప్పుకుంటా.. నాగార్జునతో మొత్తం చెప్పేసింది!

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమైపోయింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ 100 రోజులపాటు ఎంటర్టైన్ చేయనున్నారు. సీజన్ 3లో వరుణ్ సందేశ్, వితిక జంట.. నటి హేమ, శ్రీముఖి లాంటి సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. తొలి ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 

జబర్దస్త్ వినోద్ పై దాడి కేసు.. ఐదుగురిని బుక్ చేసిన పోలీసులు!

జబర్దస్త్ ఫేమ్ వినోద్ పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఓ ఇంటి విషయంలో ఓనర్లకు, వినోద్ కు మధ్య వివాదం సాగుతోంది. గొడవ పెద్దది కావడంతో ఇంటి ఓనర్ ఒకరు వినోద్ పై దాడికి దిగారు. ఇనుపరాడ్లతో కొట్టడంతో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. 

 

జూ.ఎన్టీఆర్ నా పెద్ద కొడుకు.. నాగార్జున కామెంట్స్ కు కారణం ఇదే!

ఎన్నో వివాదాలతో అసలు ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు బిగ్ బాస్ 3పై ఉన్నాయి. కానీ ఆ వివాదాలేవీ బిగ్ బాస్ షోపై ప్రభావం చూపలేదు. బిగ్ బాస్ సీజన్ 3 ఆరంభం అదిరింది. తొలి ఎపిసోడ్ లోనే కింగ్ నాగార్జున మెప్పించాడు. నాగార్జునకు ఉన్న వాక్చాతుర్యత, స్క్రీన్ ప్రజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

రిజెక్ట్ చేస్తున్న కీర్తి సురేష్.. ఇలియానా చేసిన తప్పే!

కీర్తి సురేష్ తక్కువ సమయంలోనే తెలుగులో, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. కొన్ని చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ తెలుగులో నటించిన తొలి చిత్రం నేను శైలజ. ఫస్ట్ మూవీనే హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. 

 

క్రికెట్ జట్టును సెట్ చేస్తా...రంగంలోకి పాక్ ప్రధాని ఇమ్రాన్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇక నుండి దేశ సమస్యలతో పాటు క్రికెట్ సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ కప్ టోర్నీలో పాక్ పేలవ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

 

ప్రపంచ కప్ ఫైనల్ ఓవర్ త్రో: ఐదు పరుగులే కానీ ఆరిచ్చేశా, తప్పాను: అంపైర్

ప్రపంచ కప్ 2019 ఫైనల్లో అంపైర్ ధర్మసేన తీసుకున్న ఓవర్ త్రో నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కూడా తాను తీసుకున్న ఆ నిర్ణయం నిజంగానే తప్పుడుదని..కానీ ఆ పరిస్థితుల్లో అలాగే చేయాల్సి వచ్చిందన్నాడు.  

 

సంచలన వీడియో బయట పెట్టిన రజనీకాంత్ భార్య!

సూపర్ స్టార్ రజనీకాంత్ సేవ కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారు. ఆయన సతీమణి లతా రజనీకాంత్ కూడా కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసి పలు చారిటి కార్యక్రమాలకు సాయం చేస్తున్నారు. తాజాగా లతా రజనీకాంత్ పోస్ట్ చేసిన ఓ వీడియో సంచనలంగా మారింది. 

 

రాయుడిని కాదని మయాంక్ ను ఎందుకు ఎంపిక చేశామంటే: ఎమ్మెస్కే ప్రసాద్

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అర్థాంతరంగా తన కెరీర్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రాాయుడు రిటైర్మెంట్ కు సెలెక్షన్ కమిటీ ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కారణమంటూ అభిమానులు ఆరోపిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నాడు. 

 

ప్రో కబడ్డి 2019: సొంత గడ్డపై మరో ఓటమి....తెలుగు టైటాన్స్ పై తమిళ తలైవాస్ ఘనవిజయం

గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ 2019 లో తెలుగు టైటాన్స్ మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటికే యూ ముంబా చేతిలో ఓటమిపాలైన టైటాన్స్ తాజాగా తమిళ తలైవాస్ చేతిలో కూడా ఓటమిని చవిచూసింది. 

 

రొమాన్స్ విషయంలో పట్టించుకోకూడనివి ఇవే..

శృంగారంలో రొమాన్స్ ది పెద్ట పీట. దీనిని ఎక్కువ సేపు ఆస్వాదించాలంటే... ఓరల్ సెక్స్ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇది లేకుండా  సెక్స్ అంటూ... ఎక్కువగా ఆస్వాదించలేరనేది పచ్చి నిజం. 

 

 

click me!