కర్ణాటక రాజకీయం గంటగంటకు మలుపులు తిరుగుతోంది. బలనిరూపణ ఈరోజే జరగాలంటూ బీజేపీ పట్టుబడుతుంటుంటే కాంగ్రెస్-జేడీఎస్ మాత్రం రెండు రోజులు గడువు క ావాలని కోరుతోంది.రెబెల్స్ పై మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో రెండు రోజులు గడువు ఇవ్వాలని కోరారు. 

దీంతో సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నిరసనలతో సభ హోరెత్తుతోంది. ఎట్టిపరిస్థితుల్లో ఈరోజే బలపరీక్ష జరగాల్సిందేనని బీజేపీ శాసన సభాపక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు స్పీకర్ రమేష్ కుమార్ సైతం ఈరోజే బలనిరూపణ చేసుకోవాల్సిందిగా అధికార పక్షానికి సూచించారు. తనను బలిపశువును చేయోద్దంటూ వేడుకున్నారు. అర్ధరాత్రి అయినా తాను ఉంటానని బలనిరూపణ చేసుకోవాలని సూచించారు.

కర్ణాటక అసెంబ్లీలో మరోసారి తీవ్ర నిరసన తెలిపింది బీజేపి. ఎట్టి పరిస్థితుల్లో బలనిరూపణ చేపట్టాల్సిందేనని అసెంబ్లీలో పట్టుబట్టారు. సాయంత్రం ఆరు గంటల లోపు బలనిరూపణ చేసుకోవాలని స్పీకర్ రమేష్ కుమార్ ఇచ్చిన గడువు ముగిసిందని ఇక ఆగేది లేదంటూ బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. 

బలనిరూపణకు యడ్యూరప్ప పట్టుబట్టారు. మరోవైపు బలనిరూపణకు రెండు రోజులు గడువు ఇవ్వాలని స్పీకర్ రమేష్ కుమార్ ను కోరారు సీఎం కుమారస్వామి. గడువు ముగిసిన నేపథ్యంలో స్పీకర్ తో భేటీ అయిన కుమార స్వామి సమయం కావాలని అడిగారు.

బలపరీక్షపై స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకొంటారని కాంగ్రెస్ శాసనసభపక్ష నేత సిద్దరామయ్య ప్రకటించారు.

మరింత సమయం కావాలని స్పీకర్ ను కోరిన సీఎం కుమారస్వామి

 

బలపరీక్షకు సిద్దం కావాలని స్పీకర్ ఆదేశం

కర్ణాటక సీఎం కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ తో భటే అయ్యారు

గవర్నర్ అపాయింట్‌మెంట్ ను సీఎం కుమారస్వామి కోరలేదని సీఎంఓ వర్గాలు ప్రకటించాయి.

 

కర్ణాటక:  కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బలనిరూపణకై అటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. అటు రెబల్స్ తన పంతం వీడటం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కుమార స్వామిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో కన్నడ నాట నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా సీఎం కుమార స్వామి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

రాత్రి 7 గంటలకు గవర్నర్ వాలాను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. బలనిరూపణకు ముందే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమార స్వామి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.