హైదరాబాద్: హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దీపిక అనే విద్యార్ధిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బాత్‌రూమ్ లో ఆమె మృతదేహన్ని సహచర విద్యార్థినులు గుర్తించారు.

హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన దీపిక మహాపాత్ర కొంత కాలంగా న్యూరో సమస్యతో బాధపడుతున్నట్టుగా సహచర విద్యార్థినులు చెబుతున్నారు.  అయితే  సోమవారం నాడు తెల్లవారుజామున ఆమె బాత్‌రూమ్‌లో పడి మృతి చెందింది.దీపిక మరణించిన విషయాన్ని కాలేజీ యాజమాన్యం కుటుంబసభ్యులకు సమాచారం అందించింది.హిందీ సబ్జెక్టుపై దీపిక మహాపాత్ర పీహెచ్‌డీ చేస్తుంది.