అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర రాజధాని అమరావతికి నిధులు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గడంపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని విరుచుకుపడ్డారు. 

టీడీపీ ప్రభుత్వ చర్యలకు విస్తుపోయిన ప్రపంచ బ్యాంకు రుణాన్ని నిలిపివేసిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించడంపై చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.  ప్రపంచ బ్యాంక్ అభ్యంతరాలను టీడీపీ ప్రభుత్వం పక్కనబెట్టిందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన ఆరోపణల్లో ఒక్కటైనా ప్రభుత్వం నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమని చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతి ప్రాజెక్టు పరిశీలించేందుకు రావడానికి కారణం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని నిలదీశారు. 

అమరావతి ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైసీపీ అడుగడుగునా అడ్డుపడిందని మండిపడ్డారు. భూములపై కోర్టులకు వెళ్లారని, పంటలకు నిప్పంటించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, జాతీయ ట్రిబ్యునల్ కు లేఖలు రాశారని, వరల్డ్ బ్యాంకుకు సిరీస్ గా లేఖలు రాసి అడ్డుపడ్డది వాస్తవం కాదా అని నిలదీశారు. 

రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు ఆనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆనాడు చేసిన పనివల్లే నేడు మీరు పన్నిన ఉచ్చులోనే పడ్డారని చంద్రబాబు తిట్టుపోశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అసెంబ్లీలో టీడీపీ దూకుడు: స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు