అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు రాజకీయాలు చేస్తోందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అమరావతి రాజధాని పేరు కూడా ఉచ్చరించలేని స్థితిలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పనికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని భూములకు సంబంధించి ఎన్నో కేసులు వేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

ప్రతిపక్ష పార్టీ సహకరించకపోయినా తాము తలచకుని అమరావతిని నిర్మించామని చెప్పుకొచ్చారు. తాము తలచుకున్నాం కాబట్టే ఈరోజు కూర్చోవడానికి అమరావతి ఉందని తెలిపారు. ఇరిగేషన్ కార్యాలయాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ గా తొలుత రూపకల్పన చేశాం కాబట్టే అది ఇప్పుడు రాజ్ భవన్ గా రూపుదిద్దుకుంటోందని చంద్రబాబు గుర్తు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

నేను దేనికైనా సిద్ధమే.. నువ్వు సిద్ధమా...?: బుగ్గనకు మాజీసీఎం చంద్రబాబు సవాల్

అసెంబ్లీలో టీడీపీ దూకుడు: స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు