దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువత ఎక్కువగా ఈ షోని ఫాలో అవుతున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 3 తెలుగు ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. తొలిరోజే కింగ్ నాగార్జున అదరగొట్టేశారు. నాగార్జున హోస్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. 

బిగ్ బాస్ 3లో క్రేజీ యాంకర్ శ్రీముఖి కూడా ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. శ్రీముఖి, హేమ, వరుణ్ సందేశ్ లాంటి పాపులర్ సెలెబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో ఏమేరకు ప్రభావం చూపుతారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. ఈ విషయంలో శ్రీముఖికి మాత్రం బాగా క్లారిటీ ఉన్నట్లు ఉంది. 

శ్రీముఖి బుల్లి తెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తోంది. యాంకర్ గా వారంలో అని రోజులు బిజీగా ఉంటాయి. నీవు చేస్తున్న షోలన్ని పక్కన పెట్టేసి బిగ్ బాస్ కు ఎందుకు వచ్చావు అని నాగార్జున ప్రశ్నించారు. బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చేసింది. ఎలాగైనా ఈ షోలో పాల్గొనాలని అనుకున్నా. అందుకే అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి బిగ్ బాస్ కు వచ్చేశా అని శ్రీముఖి తెలిపింది. 

ఇక బిగ్ బాస్ షో ప్రారంభం ముందు శ్రీముఖి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. తాను బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మీ అందరిని ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ హౌస్ కు వెళుతున్నా. నాకు మీ ఆదరణ కావాలి అని శ్రీముఖి అభిమానులని కోరింది.