అమరావతి:  రాష్ట్రంలో 1.40 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.  రాత పరీక్ష ద్వారానే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

సోమవారం నాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో లక్ష11వేల 114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నట్టుగా మంత్రి తెలిపారు. మరో వైపు  3 ,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.

భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తున్నట్టుగా  పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.  గ్రామ సచివాలయ ఉద్యోగాలను  డిఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి ప్రకటించారు. రాత పరీక్ష ద్వారానే సెలక్షన్ ప్రక్రియ ఉంటుందని మంత్రి తెలిపారు.

పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన ఈ రాష్ట్రంలోనే చేపట్టినట్టుగా మంత్రి గుర్తు చేశారు.  ఈ ఉద్యోగాల కల్పనను బాహుబలి నియామకాలు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.