హైదరాబాద్: ఆస్తుల అటాచ్ మెంట్ విషయంలో కోర్టు తీర్పును అధికారులు అమలు చేయడం లేదని  గాలి జనార్ధన్ రెడ్డి  చెప్పారు. ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

సోమవారం నాడు ఈడీ ఎదుట  గాలి జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈడీ అధికారుల విచారణ ముగిసిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రూ. 1000 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టుగా  ఆయన చెప్పారు. అయితే ఈ విషయంలో తాను కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు.

ఈ వ్యవహరంపై తాను మరోసారి కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన తెలిపారు.  అధికారుల తీరు బాగా లేదన్నారు.  తమ ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. 

ఈ విషయమై ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడ సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినట్టుగా గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు.హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అక్రమ మైనింగ్ కేసులో ఈడీ ఎదుట గాలి జనార్ధన్ రెడ్డి