Asianet News TeluguAsianet News Telugu

నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 (వీడియో)

చంద్రయాన్ -2 ను నెల్లూరు శ్రీహరికోట సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి  ప్రయోగించారు. 

Chandrayaan-2 lifts off, propels India into space big league
Author
Nellore, First Published Jul 22, 2019, 2:47 PM IST

నెల్లూరు: చంద్రయాన్ -2  సోమవారం నాడు ప్రయోగించారు. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుండి  జీఎస్ఎల్‌వీ- మార్క్3 ఎం1 నింగిలోకి దూసుకెళ్లింది.

వాహక నౌక 3.8 టన్నుల బరువు గల చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.సతీష్ ధావన్ ప్రయోగ కేంద్రం నండి రాకెట్‌ బయలుదేరిన తరువాత 16.13 నిమిషాలపాటు ప్రయాణించనుంది. 

 

నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత చంద్రయాన్ -2 రాకెట్ నుండి విడిపోతుంది. క్రయోజనిక్ ఇంజన్ లో సాంకేతిక లోపంతో  ఈ నెల 14వ తేదీన ప్రయోగం వాయిదా పడింది.చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. ఆర్బిటర్ నుండి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. ఆర్బిటర్ నుండి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

చంద్రునిపై క్లిష్టమైన సాఫ్ట్ ల్యాండింగ్  కోసం ఇస్రో తొలి సారిగా చంద్రయాన్-2 ను ప్రయోగించింది.చంద్రునిపై 14 రోజుల పాటు రోవర్  ప్రయాణం చేస్తోంది.చంద్రుని ఉపరితలంపై పదార్ధాలను రోవర్ విశ్లేషించనుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.చంద్రుని ఉపరితంలపై ఉన్న పరిస్థితులను రోవర్ తన కెమెరాలో బంధించనుంది.

చంద్రయాన్-1  ద్వారా చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్టు గుర్తించారు.  చంద్రయాన్ -2 ద్వారా చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులపై శాస్త్రవేత్తలు పరిశోధించనున్నారు.చంద్రయాన్-2  ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ప్రయోగం విజయవంతమైన వెంటనే ఇస్రో ఛైర్మెన్ శివన్ తో పాటు శాస్త్రవేత్తలు పరస్పరం అభినందించుకొన్నారు.ప్రయోగించిన 16:13 నిమిసాల తర్వాత ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది. 3.8 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లింది రాకెట్.

సంబంధిత వార్తలు

నేడే చంద్రయాన్-2: అందరి దృష్టి ఇస్రోపైనే

రేపే చంద్రయాన్-2: నేటి నుంచే కౌంట్ డౌన్

 

 

Follow Us:
Download App:
  • android
  • ios