సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియో హృదయ విదారకంగా ఉంది. ఓ మహిళ చిన్నారిని కొడుతూ, కాలితో తొక్కుతూ, కింద పడేస్తూ చిత్రవధకు గురిచేస్తున్న వీడియో అది. దీనిపై లతా రజనీకాంత్ స్పందించారు. 

లతా రజనీకాంత్ దయా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పౌండేషన్ ఎక్కువగా అనాధ పిల్లలని అక్కున చేర్చుకుంటుంది. పీస్ ఆఫ్ చిల్డ్రన్ పేరుతో లతా రజనీకాంత్ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఈ వీడియో చూసిన లతా రజనీకాంత్ స్పందిస్తూ.. చిన్నారి ఆచూకీ తెలిసిన వారు తమకు ఫోన్ చేయాలని ట్విట్టర్ లో ఫోన్ నెంబర్ పొందుపరిచారు. ఇటీవల చిన్నపిల్లలని చిత్ర వద్దకు గురిచేసే సంఘటనలు ఎక్కువవుతూనే ఉన్నాయి.