సినిమావాళ్లు ఎప్పుటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో రాకపోతే ప్రేక్షకులు పట్టించుకోవటం లేదు. రొటీన్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ లాంటి  చిన్న హీరోల సినిమాల పరిస్దితి అయితే మరీ దారుణం. కాన్సెప్టే అక్కడ కింగ్  అయ్యిండాల్సిన పరిస్దితి. అందుకేనేమో ఇప్పుడు రాజ్ తరుణ్ కొత్తగా కమిటైన చిత్రానికి బోల్డంత డిఫరెన్స్ ఉన్న బోల్డ్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే... ఆ మధ్యన వచ్చిన నితిన్ ‘గుండె జారి గల్లంతయ్యిందే’తో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు కొండా విజయ్ కుమార్ తో సినిమా కమిటయ్యాడు రాజ్ తరణ్.  గ్యాప్ తరువాత   కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ఈ చిత్రం కథ చాలా ఇంట్రస్టింగ్ ప్లే తో సాగుతూ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో సినిమాలో ఫుల్ కామెడీని పండిస్తుందని తెలుస్తోంది. ఒకవిధంగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో కూడా ఈ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీనే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు అదే ఫార్ములాని ఈ డైరెక్టర్ మళ్ళీ ఫాలో అవ్వబోతున్నాడంటున్నారు. 

ఎలాగూ రాజ్ తరుణ్ కి ఉన్న టైమింగ్ తో  ఈ సినిమా ఫన్ తో  సాగే స్క్రీన్ ప్లేతో..  రెడీ చేసారట ఈ డైరెక్టర్. మెయిన్ గా లవ్ స్టోరీ ఫుల్ ఫన్ తో వైవిధ్యంగా ఉంటుందట. గాలికి తిరిగే ఓ కుర్రాడు తన కన్నా వయసులో పెద్దదైన ఆంటీ లాంటి ఓ అమ్మాయిని ఇష్టపడితే.. ఆ తరువాత జరిగే  పరిణామాలు ఏమిటి ? అతని కుటుంబంలో ఆ ప్రేమ ఏ విధంగా చిచ్చు పెట్టింది. ఆ అమ్మాయిని సొంతం చేసుకునే క్రమంలో అతను ఏమి చేశాడు ? ఇలా ముదురు భామతో సాగే ప్రేమతో సినిమా అదిరిపోతుందంటున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌ స్టాప్‌ గా షూటింగ్‌ జరుపుకోనుంది.