కీర్తి సురేష్ తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ చిత్రాల్లో కీర్తి సురేష్ మంచి విజయాల్ని సొంతం చేసుకుంది. తెలుగులో కీర్తి సురేష్ నటించిన మహానటి చిత్రం ఒక్కసారిగా ఆమె క్రేజ్ ని పెంచేసింది. తిరుగులేని నటనతో ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కించుకుంది. 

ప్రస్తుతం కీర్తి సురేష్ కు తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ కీర్తి సురేష్ మాత్రం వస్తున్న ప్రతి అవకాశాన్ని రిజెక్ట్ చేస్తోందట. కథ నచ్చలేదని సాకులు చెబుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల తెలుగులో ఓ స్టార్ హీరో సరసన నటించే అవకాశం రాగా తన పాత్రకు ప్రాధాన్యత లేదని పక్కకు తప్పుకుందట. 

ఇలా కీర్తి సురేష్ వరుసగా సినిమాలు రిజెక్ట్ చేయడానికి కారణం కథ నచ్చకపోవడం కాదని వేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ త్వరలో శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మించబోయే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రం కోసం ఒళ్ళు హూనం చేసుకుని బక్కచిక్కిపోయింది. 

ఇకపై బాలీవుడ్ చిత్రాల్లో నటించడం కోసం ముంబైలోనే ఉండాలని కీర్తి సురేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న అవకాశాలు వదిలేసి బాలీవుడ్ లో ఇబ్బందులు పడడం ఎందుకనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఇలియానా కూడా ఇలాగే చేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా బాలీవుడ్ లో ఒకటి రెండు హిట్లు పడగానే సౌత్ ని వదిలేసింది. ఇప్పుడు ఆమెకు ఎక్కడా అవకాశాలు లేవు.