Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ సెన్సార్ చేయాలంటూ పిటిషన్... విచారణ వాయిదా

బ్రాడ్ కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా షో ప్రసారం చేస్తున్నారని... దీనిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

High Court Gives Second Lifeline To Bigg Boss, case adjourns to july 29th
Author
Hyderabad, First Published Jul 22, 2019, 4:59 PM IST

బిగ్ బాస్ షోని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.  ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. బ్రాడ్ కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా షో ప్రసారం చేస్తున్నారని... దీనిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

షోని నిలిపివేయాలని.. కుదరని పక్షంలో సెన్సార్ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు దీనిలో హోస్ట్ అక్కినేని నాగార్జునతోపాటు మరో పది మందిని కేతిరెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. సినిమాలకు ఏవిధంగా సెన్సార్ చేస్తారో  అశ్లీలత, డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న ఈ గేమ్ షోని కూడా సెన్సార్ చేయాలని ఆయన కోర్టును కోరారు.

ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ చట్టాలను అనుసరించి ఈ షోపై చర్యలు తీసుకోవాలని ఆయన వాజ్యంలో పేర్కొన్నారు. కాగా.. ఈ షోని అడ్డుకోవాలని ఎంత మంతి ప్రయత్నించినా... ఆదివారం రాత్రి మాత్రం షో అట్టహాసంగా ప్రారంభమైంది. 15మంది కంటిస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios