సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరలో అత్యంత కీలకఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది.

ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని..  నా అక్కా చెల్లెళ్లే సంతోషంగా ఉంటే తాను సంతోషంగా ఉంటానని ఆమె తెలిపారు. సంతోషంగా భక్తులు ముడుపులు చెల్లించుకున్నారని.. గంగాదేవికి జలాభిషేకం చేస్తే తప్పకుండా అన్ని కోరికలు నెరవేరుతాయని స్వర్ణలత తెలిపారు.

తాను గత సంవత్సరం కొంత బాధపడ్డానని.. ఈ ఏడాది సిబ్బంది బాగా పనిచేశారని స్వర్ణలత చెప్పింది. ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరింది. అక్కచెల్లెళ్లు దూరంగా వెళ్లకుండా.. తనకు దగ్గరగానే ఉంది పూజలు జరిపించాలని సూచించింది. తనకు మరోసారి బోనాన్ని తప్పకుండా ఇవ్వాలని ఆమె సూచించారు.

మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి.. అమ్మవారిని తనలోకి ఆహ్వానించుకుని రాబోయే రోజుల్లో జరగబోయే విషయాలను చెప్పడం ఆనవాయితీగా వస్తోంది.