అమరావతి: భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నిప్పులు చెరిగారు మాజీమంత్రి నారా లోకేష్. ఇరిగేషన్ మంత్రికి ఏం అంశంపైనా అవగాహన లేదని విమర్శించారు. 60సి నిబంధన అంటే ఏమిటో మంత్రి అనిల్ కుమార్ కు ఏమైనా తెలుసా అంటూ మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టుకు విషయంలో 60సి ప్రకారం పనులు వేరే సంస్థలకు అప్పగించవచ్చునని అది తెలియకుండా మంత్రి ఏదేదో చెప్తున్నారని విమర్శించారు. పోలవరంలో ఆర్ అండ్ ఆర్ కూడా తామే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందని అన్నారు. 

శాసన మండలి అంటే మంత్రులు హడలిపోతున్నారని అన్నారు. కౌన్సిల్ ను మంత్రులు భరించలేక పోతున్నారని విమర్శించారు. తాము ఏ ప్రశ్న లేవనెత్తినా 
సమాధానం చెప్పకుండా మంత్రులు శాసన మండలి నుంచి వెళ్లిపోతున్నారంటూ నారా లోకేష్ సెటైర్లు వేశారు.