జబర్దస్త్ ఫేమ్ వినోద్ పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఓ ఇంటి విషయంలో ఓనర్లకు, వినోద్ కు మధ్య వివాదం సాగుతోంది. గొడవ పెద్దది కావడంతో ఇంటి ఓనర్ ఒకరు వినోద్ పై దాడికి దిగారు. ఇనుపరాడ్లతో కొట్టడంతో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

తాజాగా ఈ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. వినోద్ అందించిన వివరాల ప్రకారం మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇంటి ఓనర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వినోద్ పోలీసులకు కోరుతున్నాడు. 

ఆ ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వాళ్ళు ఐదుగురు తనపై దాడి చేసి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వినోద్ ఆరోపిస్తున్నాడు. ఇంటికి సంబందించిన డబ్బు మొత్తం చెల్లించా. ఆ ఏరియా కౌన్సిలర్ కూడా న్యాయం నా వైపే ఉందని చెప్పినట్లు వినోద్ చెబుతున్నాడు.