యావత్ భారతావని ఎదురు చూసిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్ నుంచి చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే జరిగిన ఈ ప్రయోగాన్ని అభినందిస్తూ ప్రముఖులంతా ట్వీట్స్ చేస్తున్నారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన శైలిలో చంద్రయాన్ 2పై స్పందించాడు. ' హలో డార్లింగ్స్.. ఇది భారతీయులంతా గర్వించదగ్గ రోజు. ఇస్రో నిర్వహించిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం అయింది. మా బాహుబలి చిత్ర యూనిట్ కు కూడా ఇది గర్వకారణం. చంద్రయాన్ 2ని క్ష్యలోకి తీసుకెళ్లిన రాకెట్ జీఎస్ఎల్‌వీ మార్క్ 3 ఎం 1కు ఇస్రో శాస్త్రవేత్తలు బాహుబలి అని నామకరణం చేశారు' అని ప్రభాస్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. 

ఇది రాజమౌళి గర్వించే విషయం అనడంలో సందేహం లేదు. తాను తెరక్కించిన అద్భుతమైన చిత్ర టైటిల్ ని రాకెట్ కు పెట్టడం నిజంగా విశేషమే. బాహుబలి అధికారిక ట్విటర్ అకౌంట్ నుంచి కూడా నిర్మాతలు స్పందించారు. 300 టన్నుల చంద్రయాన్ 2ని ప్రయోగించడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి దాగుందని అన్నారు.