బిగ్ బాస్ 1,2 సీజన్ లు సరదాగా సాగిపోయాయి. బిగ్ బాస్ 3లో కాస్త డిఫెరెంట్ గా ట్రై చేశారు. తొలి సారి సెలెబ్రిటీ కపుల్స్ ని రంగంలోకి దించారు. హీరో వరుణ్ సందేశ్, అతడి సతీమణి వితిక షెరు జంటగా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారు. వీరిద్దరూ వేదికపైకి ఎంటర్ కాగానే నాగార్జున కొన్ని ప్రశ్నలు సంధించాడు. 

వీరిద్దరి ప్రేమ,పెళ్లి గురించి అడగగా.. వితిక తమ లవ్ స్టోరీ మొత్తం నాగార్జునకు చెప్పేసింది.. మొదట మేమిద్దరం ఓ సినిమా థియేటర్ లో కలుసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలసి నటించాం కూడా. తొలి మూడు నెలలు మేమిద్దరం అసలు మాట్లాడుకోలేదు. ఓ సాంగ్ షూటింగ్ కోసం మలేషియా వెళ్లాం. అక్కడ వరుణ్ నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. 

నేను ఓ కండిషన్ పెట్టా.. పెళ్లి చేసుకుంటానంటేనే ప్రేమించుకుందాం.. లేకుంటే లేదు అని చెప్పేశా. ఓకె పెళ్లి చేసుకుందాం అని వరుణ్ కూడా తెలిపాడు. దీనితో ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలా మా ఇద్దరి వివాహం జరిగింది అని వితిక తమ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.