ప్రముఖ ఛానల్ లో తీన్మార్ సావిత్రిగా యాంకర్ శివజ్యోతి పాపులర్ అయింది. బిత్తిరి సత్తితో కలసి సావిత్రి చేసే సరదా న్యూస్ ప్రజంటేషన్ అందరిని ఆకట్టుకుంది. ఆదివారం రోజు ప్రారంభమైన బిగ్ బాస్ షోలో సావిత్రి తొలి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇక సావిత్రి విషయంలో వివాదం జరిగింది అంటూ కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తేలాల్సి ఉంది. 

సావిత్రి అసలు పేరు శివ జ్యోతి. బిగ్ బాస్ షో కోసం శివ జ్యోతి తాను పనిచేస్తున్న ఛానల్ కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తీన్మార్ సావిత్రి అనేది ఛానల్ ద్వారా వచ్చిన గుర్తింపు. దానిని ఉపయోగించుకుంటే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం అని సదరు ఛానల్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

అందుకే నిన్న జరిగిన బిగ్ బాస్ షో లో కూడా ఆమెని శివజ్యోతి అనే నాగార్జున పిలిచారు. ఎక్కడా తీన్మార్ ప్రస్తావన కానీ, సదరు ఛానల్ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. బిగ్ బాస్ 3 హౌస్ లోకి అడుగు పెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ శివ జ్యోతినే.