పవన్ ఆవేదన: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 6, 2019, 5:40 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

'బుర్ర‌క‌థ‌' మూవీ రివ్యూ!

తెలుగు సినిమా కొత్తదారులు వెతుక్కుంటోంది. నావెల్టీ పాయింట్స్ ని టచ్ చేస్తోంది. అందుకు నిదర్శనం గత కొంతకాలంగా వస్తున్న చిత్రాలే. అయితే అదే సమయంలో కొత్త  పేరుతో చెత్త  పోగవుతోంది.  ఒకే బుర్రలో రెండు మెదడులు ఉంటే అనే ఆలోచనతో బుర్రకథ అనే చిత్రం మన ముందుకు వచ్చింది. 

 

జైలుకు వెళ్లి వచ్చినవారే....: జగన్ పై పవన్ కల్యాణ్ వ్యాఖ్య

జైలుకు వెళ్లివచ్చినవారే బయటకు వచ్చి ఇబ్బంది పడనప్పుడు తానెందుకు ఇబ్బంది పడాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసినట్లుగా భావిస్తున్నారు.

 

కర్ణాటక క్రైసిస్: రంగంలోకి శివకుమార్, నలుగురు ఎమ్మెల్యేలు వెనక్కి

పరిస్థితిని చక్కదిద్దడంలో శివకుమార్ పాక్షికంగా విజయం సాధించారు. ఆయన ప్రయత్నంతో నలుగురు శానససభ్యులు వెనక్కి తగ్గారు. రామలింగారెడ్డి, ఎస్టీ సోమశేఖర్, మునిరత్న, బైరట్టి బసవరాజ్ రాజీనామాల నుంచి వెనక్కి తగ్గారు. 

 

వారు నన్ను భయపెడుతున్నారు : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

పరువునష్టం దావా కేసులో భాగంగా పాట్నాలో కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. బిహార్‌లోని పాట్నా కోర్టుకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యే ముందు రాజకీయ ప్రత్యర్థులు తనను వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు కుట్రపన్నుతున్నారని ట్విట్టర్‌లో ఆరోపించారు.  

 

రిలేషన్షిప్ ఉంది.. పెళ్లి ఆలోచన లేదు.. ఎఫైర్ పై కుర్ర హీరో కామెంట్స్!

బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా చాలా కాలంగా నటుడు అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తోంది. 

 

 

తిట్టిపోసి వెనక్కి...: తెలంగాణపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ విడిపోయినప్పుడు ఎటు వెళ్లాలో తనకు తెలియలేదని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ అంటే తనకు చాలా ఇష్టమని దక్కన్ పీఠభూమి అంటే గుండె కోసుకుంటానని ఆయన చెప్పారు. 
 

 

జూనియర్ ఎన్టీఆర్ పై నాదెండ్ల షాకింగ్ కామెంట్స్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు... సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. 
 

 

జైలుకు వెళ్లి వచ్చినవారే....: జగన్ పై పవన్ కల్యాణ్ వ్యాఖ్య

జైలుకు వెళ్లివచ్చినవారే బయటకు వచ్చి ఇబ్బంది పడనప్పుడు తానెందుకు ఇబ్బంది పడాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసినట్లుగా భావిస్తున్నారు.

 

బాలయ్యతో 'పింక్' రీమేకా..?

అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో అప్పట్లో బాలీవుడ్ లో తెరకెక్కిన 'పింక్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. ఇప్పుడు తమిళంలో 'పింక్' రీమేక్ తెరకెక్కుతోంది. అమితాబ్ పోషించిన పాత్రలో అజిత్ కనిపించనున్నారు.
 

 

 

సలహాలు నాకు, ఓటు వేరొకరికా: వివరణ ఇచ్చిన పవన్ కల్యాణ్

జనసేన విజయం సాధిస్తుందని అందరూ అంటుంటే తాను నమ్మలేదని, తన సభలకు లక్షల మంది వస్తారని, చేతులు ఊపడానికి ఉన్నంత హుషారు ఓటు వేయడానికి ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు. 
 

 

తండ్రి మాట ఇది : బీజేపీలోకి నాదెండ్ల మనోహర్?

ఏపీలో బీజేపీ ఆకర్షణ మంత్ర బాగానే పనిచేస్తోంది. ఒకరి తర్వాత మరొకరు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు కషాయం కండువా కప్పుకోగా... తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్లా భాస్కర్ రావు కూడా బీజేపీ లో చేరెందుకు రెడీ అయ్యారు.
 

 

నన్నెవరూ జైల్లో పెట్టలేరు, ఖుషీ తర్వాత వైఫల్యాలే: పవన్ కల్యాణ్

సినిమాలపై ఆసక్తి తగ్గి సమాజంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. సినిమాల్లో కూడా ఖుషీ తర్వాత అన్నీ వైఫల్యాలేనని, ఆ తర్వాత సక్సెస్ అయిన సినిమా గబ్బర్ సింగ్ అని, విజయం కోసం వేచి చూశానని, చాలా సహనంతో నిరీక్షించానని ఆయన చెప్పారు.   
 

 

నా కోరిక తీరింది.. మోహన్ బాబు

ఎప్పటి నుంచో ఉన్న తన కోరిక నెరవేరిందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
 

నీ జాతకంకి నమస్కారం.. సమంతపై ఛార్మి కామెంట్స్!

అక్కినేని సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకులు ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. దీంతో సమంత సంబరాల్లో మునిగిపోయింది.

 

లోకేష్ ఓ చెల్లని కాసు.. జోకులు వేస్తున్నాడు.. విజయసాయి

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్ లపై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. లోకేష్ ఓ చెల్లని కాసు అంటూ విమర్శలు చేశారు. లోకేష్ ని టీడీపీ జాతీయ అధ్యక్షుడుని చేయాలని భావిస్తున్నారా అంటూ కౌంటర్లు వేశాడు. చంద్రబాబుకి ఫోబియా ఉందని విమర్శించారు.
 

 

బీజేపీలో చేరిన టీడీపీ నేతలపై కేశినేని విసుర్లు

బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ నేతలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎమ్ రమేష్, టీజీ వెంకటేష్ లు ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తాము పార్టీ మారామని వాళ్లు చెప్పారు. కాగా... దీనిపై తాజాగా కేశినేని స్పందించారు.
 

 

లోకేష్ ని కించపరిచేలా ఎన్ఆర్ఐ పోస్టు.. కేసు

మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ని కించపరుస్తూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. కాగా... అతనిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
 


నయన్ కి చెక్ పెడుతోన్న సమంత..!

టాలీవుడ్ ముద్దుగుమ్మ అక్కినేని సమంత పెళ్లి తరువాత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కమర్షియల్ సినిమాలకు పక్కన పెట్టి కథా బలమున్న లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటోంది. నటిగా తన స్థాయిని మరింత పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
 

 

విజయ నిర్మల సంతాప సభలో కూలిన టెంట్!

నటి, దర్శకురాలు విజయ్ నిర్మల సంతాప సభలో ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయ్ నిర్మల మరణించి పది రోజులు కావడంతో ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని సంధ్య కన్వెషనల్ సెంటర్ లో ఆమె కుటుంబసభ్యులు సంతాప సభ ఏర్పాటు చేశారు.
 

 

‘ఓ బేబీ’ ప్రీమియర్ షో.. షాకింగ్ కలెక్షన్స్!

బ్బై ఏళ్ల వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌ చెప్పే ప్రయత్నం చేసి విజయం సాధించారు దర్శకురాలు నందిని రెడ్డి. కొరియన్‌ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.బేబీ పాత్రలో సమంత మెప్పించిందంటూ అంతటా ప్రశంసలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్ లో ఈ  సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. 
 



మహిళా అధికారి స్నానం చేస్తుండగా వీడియో..

మహిళా అధికారి స్నానం చేస్తుండగా... సహ అధికారి ఫోన్ లో వీడియో తీశాడు. కాగా... ఆ విషయాన్ని గమనించిన ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు  చేయడంతో... అతనిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మదురై సమీపంలోని చదురగిరిమలై ఆలయంలో  చోటుచేసుకుంది.
 

 

సిబిఐ నుంచి నాగేశ్వర రావు ఔట్, కొత్త పోస్టు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అదనపు డైరెక్టర్ పదవి నుంచి తెలుగు అధికారి ఎం. నాగేశ్వర రావు బదిలీ ఆయ్యారు. ఒడిశా క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి నాగేశ్వర రావును సిబిఐ నుంచి తప్పించి ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు.
 

సురేష్ బాబు అంచనా తప్పింది.. సమంత గెలిచింది!

అక్కినేని సమంత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన చిత్రం 'ఓ బేబీ'. అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ రెండూ కూడా సమంతకు సొంత నిర్మాణ సంస్థలనే చెప్పాలి. అందుకే 'ఓ బేబీ' సినిమా ప్రమోషన్స్ దగ్గరుండి చూసుకుంది సమంత.

 

టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన బంగ్లా క్రికెటర్

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును షకీబ్ బద్దలు కొట్టాడు.  దానికి తోడు  ప్రపంచకప్‌లో 600కు పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా షకీబ్‌ ఘనత సాధించాడు. 
 

తన రిటైర్మెంట్ పై ధోనీ షాకింగ్ కామెంట్స్

ఇప్పటికే అంబటి రాయుడు తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు. పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్, దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ లు ఆటకు వీడ్కోలు పలికారు. ఈ జాబితాలో ధోనీ కూడా చేరబోతున్నాడంటూ వార్తలు వెలువడుతున్నాయి. కాగా దీనిపై ధోనీ స్పందించారు.
 

 

షోయబ్ మాలిక్ రిటైర్మెంట్... సానియా స్పందన ఇదే

షోయబ్ రిటైర్మెంట్ పై అతని భార్య, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా స్పందించారు. తన భర్తను చూస్తుంటే తనకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తన భర్తపై ప్రశంసల జల్లు కురిపించింది.
 

 

ప్రపంచ కప్: వన్డేల నుంచి షోయబ్ మాలిక్ రిటైర్

ట్విట్టర్ వేదికగా షోయబ్ మాలిక తన రిటైర్మెంట్ గురించి శుక్రవారం నాడు చెప్పాడు. నేడు తాను అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని షోయబ్ మాలిక్ చెప్పాడు.

 

 

click me!