బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ నేతలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎమ్ రమేష్, టీజీ వెంకటేష్ లు ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తాము పార్టీ మారామని వాళ్లు చెప్పారు. కాగా... దీనిపై తాజాగా కేశినేని స్పందించారు.

‘‘మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీ లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీ లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి బీజేపీ లోకి చేరారో అని...’’ అంటూ కౌంటర్లు వేశారు.

గత కొంతకాలంగా.. కేశినేని తాను ఏం చెప్పాలని అనుకున్నా... సోషల్ మీడియా వేదికగానే స్పందిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకి ఒకరు చొప్పున టార్గెట్ చేస్తూ... విమర్శలు చేస్తున్నారు.