మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్ లపై మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. లోకేష్ ఓ చెల్లని కాసు అంటూ విమర్శలు చేశారు. లోకేష్ ని టీడీపీ జాతీయ అధ్యక్షుడుని చేయాలని భావిస్తున్నారా అంటూ కౌంటర్లు వేశాడు. చంద్రబాబుకి ఫోబియా ఉందని విమర్శించారు. 

‘‘ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫోభియాలను సైకాలజీ 5 కేటగిరీలుగా విభజించింది.చంద్రబాబు గారికి సైకియాట్రిక్ పరీక్షలు చేస్తే ఆరో కేటగిరి కూడా ఉందని తేలుతుంది.ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కడప,పులివెందులలాగా మారుస్తున్నారని పదేపదే తన అకారణ భీతిని(ఫోభియా) వ్యక్తం చేస్తుంటారాయన.’’ అంటూ చంద్రబాబుని విమర్శించారు.

‘‘లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు.’’ అంటూ లోకేష్ పై కౌంటర్లు వేశారు.

‘‘అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుంది. తనను అరెస్ట్ చేస్తే చుట్టూ నిలబడి రక్షణ కల్పించాలని గతంలో ప్రజలను వేడుకున్నారు.తనకేదైనా అయితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని ఇప్పుడు బెదిరిస్తున్నారు.దాడి నాటకానికి ప్లాన్ చేశారా ఏంటి?’’ అంటూ మరో ట్వీట్ చేశారు.