పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... షోయబ్ రిటైర్మెంట్ పై అతని భార్య, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా స్పందించారు. తన భర్తను చూస్తుంటే తనకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తన భర్తపై ప్రశంసల జల్లు కురిపించింది.

‘ప్రతీ కథకి ఒక ముగింపు ఉంటుంది. జీవితంలో ప్రతీ ముగింపునకూ కొత్త అవకాశం ఎదురుచూస్తుంది. మాలిక్‌.. 20 ఏళ్ల పాటు నీ దేశం తరఫున ఎంతో నిబద్ధతతో వినయంగా ఆడావు. నువ్వు సాధించిన వాటికి నేను, ఇజాన్‌ ఎంతో గర్వపడుతున్నాం’ అని ట్వీట్‌ చేసింది. 

ఇదిలా ఉండగా.. ఈ ప్రపంచకప్ లో  షోయబ్ మూడు మ్యాచ్ లు ఆడగా కేవలం 8 పరుగులే చేయడం గమనార్హం. రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. టీం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో సైతం షోయబ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో షోయబ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.