అక్కినేని సమంత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన చిత్రం 'ఓ బేబీ'. అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ రెండూ కూడా సమంతకు సొంత నిర్మాణ సంస్థలనే చెప్పాలి. అందుకే 'ఓ బేబీ' సినిమా ప్రమోషన్స్ దగ్గరుండి చూసుకుంది సమంత.

నిజానికి సురేష్ బాబు కంటే సమంతనే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలోఎక్కువ కష్టపడింది. ఈ సినిమా విషయంలో మొదటినుండి సురేష్ బాబుకి నమ్మకం లేదు. అందుకే పెద్దగా ఇంటరెస్ట్ చూపించలేదు. ఆఖరికి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన కనిపించలేదు. 

'మిస్ గ్రానీ' సినిమా తెలుగులో వర్కవుట్ అవ్వదనేది సురేష్ బాబు నమ్మకం. ఒరిజినల్ సోల్ ఎక్కడ మిస్ అవుతుందా..? అని బాగా టెన్షన్ పడ్డాడు. సినిమా మరో రెండు రోజుల్లో సెట్స్ పైకి వెళ్తుందనగా కూడా సినిమా ఆపేయాలని సూచించారట సురేష్ బాబు.

కానీ సమంత పట్టుబట్టి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లింది. టెక్నీషియన్స్ ఎంపికలో కూడా సమంత హ్యాండ్ ఉంది. మిగిలిన కమిట్మెంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేసింది సమంత. సినిమా ఆడుతుందా లేదా అనే విషయంలో కూడా సురేష్ బాబుకి, సమంతకి ఆఖరి నిమిషంలో కూడా చర్చలు నడిచాయట. ఫైనల్ గా  సురేష్ బాబు అంచనా తప్పి సమంత సక్సెస్ అందుకుంది.