ఏపీలో బీజేపీ ఆకర్షణ మంత్ర బాగానే పనిచేస్తోంది. ఒకరి తర్వాత మరొకరు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు కషాయం కండువా కప్పుకోగా... తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్లా భాస్కర్ రావు కూడా బీజేపీ లో చేరెందుకు రెడీ అయ్యారు.

ఈ రోజు  నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ చీఫ్ అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందురు రంగం సిద్ధం మయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. బీజేపీలో చేరమని తనకు కొద్ది రోజులుగా ఒత్తిడి ఉందని.. అందుకే ఈ రోజు చేరుతున్నట్లు ప్రకటించారు.

ఆయన అలా ప్రకటించగానే.. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ పరిస్థితిపై మీడియా ఆరా తీసింది. దానిపై కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతం తన కొడుకు జనసేనలో ఉన్నాడని చెప్పారు. తన కొడుకుని బీజేపీలో చేరమని తాను చెప్పనని ఆయన అన్నారు. అయితే.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నాదెండ్ల మనోహర్... మరో రెండు రోజుల్లో తిరిగి వచ్చి... కఠిన నిర్ణయం తీసుకుంటానని తనతో చెప్పాడని ఆయన వివరించారు. 

ఈ నేపథ్యంలో మనోహర్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే వాదనలు వినపడుతున్నాయి. కాగా.. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరు వచ్చినా.. ఏపీలో ఇంక టీడీపీని నిలబెట్టలేరని అన్నారు. 

ఇదిలా ఉంటే... తానా సభల నేపథ్యంలో పవన్ అమెరికా పర్యటన వెళ్లగా.. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మరి మనోహర్.. పవన్ వెంటే కొనసాగుతారో.. తండ్రి వైపు అడుగులు వేస్తారో చూడాలి.