లండన్‌: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ బ్రేక్ చేశాడు. గత 16 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ పేర ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు.  2003 ప్రపంచకప్‌లో లీగ్‌ దశ పూర్తయ్యేవరకు సచిన్‌ చేసిన 586 పరుగులను బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ అధిగమించాడు. 

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును షకీబ్ బద్దలు కొట్టాడు.  దానికి తోడు  ప్రపంచకప్‌లో 600కు పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా షకీబ్‌ ఘనత సాధించాడు. 

2003 ప్రపంచకప్‌లో సచిన్‌ 673 పరుగులు చేశాడు. మాథ్యూ హెడెన్‌ 2003లో 659 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. షకీబ్ తాజా ప్రపంచకప్‌లో 606 పరుగులు చేసి మూడో స్థానం పొందాడు.సచిన్‌ పేరిట ఉన్న 673 పరుగుల రికార్డు మాత్రం ఇంతవరకు చెక్కుచెదరలేదు. ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు ఉంది.