బెంగళూరు: కర్ణాటక సంకీర్ణం సంక్షోభంలో పడిన స్థితిలో కాంగ్రెసు ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ రంగంలోకి దిగారు. రాజీనామాలు చేయడానికి 12 మంది కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు స్పీకర్ రమేష్ కుమార్ ఛేంబర్ కు చేరుకున్నారు. ఈ సమయంలో డికె శివకుమార్ జోక్యం చేసుకున్నారు. 

పరిస్థితిని చక్కదిద్దడంలో శివకుమార్ పాక్షికంగా విజయం సాధించారు. ఆయన ప్రయత్నంతో నలుగురు శానససభ్యులు వెనక్కి తగ్గారు. రామలింగారెడ్డి, ఎస్టీ సోమశేఖర్, మునిరత్న, బైరట్టి బసవరాజ్ రాజీనామాల నుంచి వెనక్కి తగ్గారు. 

మిగతా ఎనిమిది శాసనసభ్యులు తమ రాజీనామాలను సమర్పించారు. కాంగ్రెసుకు చెందిన ప్రతాప్ గౌడ పాటిల్, శివరామ్ హెబ్బార్, రమేష్, మహేష్ కుమాటి హళ్లి, నారాయణ గౌడ, సౌమ్యా రెడ్డ, జెడిఎస్ కు చెందిన గోపాలయ్య, హెచ్. విశ్వనాథ్ తమ రాజీనామాలు సమర్పించి గవర్నర్ ను కలిసేందుకు రాజభవన్ చేరుకున్నారు. 

విషయం తెలిసిన వెంటనే శివకుమార్ హుటాహుటిన విధానసభకు చేరుకున్నారు. ఎవరూ రాజీనామా చేయరని, వారిని కలిసేందుకు తాను వచ్చానని ఆయన చెప్పారు. ఈ స్థితిలోనే శివకుమార్, డిప్యూటీ ముఖ్యమంత్రి కాంగ్రెసు ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.  

సంబంధిత వార్త

కుమారస్వామికి ఎసరు: మరో 12 మంది ఎమ్మెల్యేల రాజీనామా (వీడియో)