కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ కొద్దిసేపటి క్రితమే సిఎస్ఈ, ఐసిఎస్ఈ ఫలితాలను విడుదల చేసింది.
ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (సీఎస్ఈ) 10వ తరగతి, ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసిఎస్సి) 12వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ కొద్దిసేపటి క్రితమే ఈ ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ఐసిఎస్సిలో 99.47 శాతం, ఐఎస్సి లో 98.19 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.
ఐసిఎస్సి పరీక్షలను 2,43,617 మంది (1,30,506 మంది బాలురు, 1,13,111 మంది బాలికలు) విద్యార్థులు రాసారు. వీరిలొ 2,42,328 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఐఎస్సి పరీక్షలను 99,901 మంది (52,765 మంది బాలురు, 47,136 మంది బాలికలు రాసారు. వీరిలో 98,088 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఐసిఎస్సి ఫలితాల్లో 2695 స్కూల్ కి గాను 2223 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు సిఐఎస్సిఈ ప్రకటించింది. ఇక ఐఎస్ఈ ఫలితాల్లో 1366 స్కూల్లకు గాను 904 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఐసిఎస్ఈ, ఐఎస్సి ఫలితాలను ఇలా చెక్ చేసుకొండి :
స్టెప్ 1 : సీఐఎస్సీఈ అధికారిక వెబ్ సైట్ www.cisce.org ని సందర్శించండి.
స్టెప్ 2 : ఫలితాల పేజిలోకి వెళ్లి ఐసిఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాలు 2024 లేదంటే ఐఎస్సీ బోర్డ్ పరీక్షల ఫలితాలు 2024 పై క్లిక్ చేయండి
స్టెప్ 3 : ఐసిఎస్ఈ లేదా ఐఎస్సీ కోర్సు కోడ్ ను ఎంచుకోండి. గుర్తింపు సంఖ్య లేదా పుట్టిన తేదీతో లాగిన్ అవ్వండి.
స్టెప్ 4 : ఫలితాలు స్క్రీన్ పై ప్రదర్శింపబడతాయి
స్టెప్ 5 : ఫలితాలను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకొండి.