మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ని కించపరుస్తూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. కాగా... అతనిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రభాకరరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు, దృశ్యాలతో కూడిన పోస్ట్‌ను పెట్టారని పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

లోకేశ్‌ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే రీతిలో ఈ పోస్టింగ్‌ ఉందని అందులో పేర్కొన్నారు. ఈనెల 3న దీన్ని గమనించి ప్రభాకరరెడ్డి గురించి ఆరా తీయగా, ఆయన అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉండే ప్రవాస భారతీయుడని, వైసీపీ సానుభూతిపరుడని తేలిందన్నారు. ఈ మేరకు ప్రభాకరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  నిందితుడి వ్యాఖ్యలతో కూడిన సీడీలను వర్ల పోలీసులకు అందజేశారు.