అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో అప్పట్లో బాలీవుడ్ లో తెరకెక్కిన 'పింక్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. ఇప్పుడు తమిళంలో 'పింక్' రీమేక్ తెరకెక్కుతోంది. అమితాబ్ పోషించిన పాత్రలో అజిత్ కనిపించనున్నారు.

తెలుగులో కూడా ఈ సినిమాను తీసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా హక్కులు నిర్మాత దిల్ రాజు దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాను తెలుగులో బాలకృష్ణ కీలక పాత్రలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమితాబ్ పోషించిన పాత్రకు టాలీవుడ్ లో ఏ సీనియర్ హీరో అయినా బాగానే ఉంటారు.

కానీ దిల్ రాజు మాత్రం బాలయ్యతో చేయాలనుకుంటున్నాడు. చాలా కాలంగా దిల్ రాజుకి బాలయ్యతో సినిమా తీయాలనే కోరిక ఉంది. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నాడట. 

ఏడాదికి కనీసం అరడజను సినిమాలు చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రాజెక్ట్ లో 'పింక్' రీమేక్ చేర్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనుక ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. లేదంటే మరో కథ సిద్ధం చేసి బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు.