ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు... సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక టీడీపీ పని అయిపోయిందని.. ఆ పార్టీకి పునర్వైభవం రావాలంటే... జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేననే అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ విషయంపై నాదెండ్ల భాస్కర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ఇలాంటి వార్తలు తాను కూడా విన్నానన్న నాదెండ్ల.. అసలు తనకు జూనియర్ ఎన్టీఆర్ తెలియదని వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను సినిమాలు చూడనని చెప్పారు. అయినా ఈ విషయం పై ఎన్టీఆర్ కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. జనసేన పార్టీ భవిష్యత్తుపై కూడా నాదెండ్ల భాస్కర్ రావు స్పందించారు. 

జనసేన గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని వెల్లడించారు. తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరడం ఒక తప్పిదం అని పరోక్షంగా భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. అటు తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడం ఓ తప్పిదమని పరోక్షంగా అన్నారు.