బిహార్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. తనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు వేధింపులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని అయినా తాను బెదిరేది లేదన్నారు రాహుల్ గాంధీ.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాహుల్ గాంధీతోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఓ కార్యకర్త పరువునష్టం దావా వేశారు.
 
పరువునష్టం దావా కేసులో భాగంగా పాట్నాలో కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. బిహార్‌లోని పాట్నా కోర్టుకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యే ముందు రాజకీయ ప్రత్యర్థులు తనను వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు కుట్రపన్నుతున్నారని ట్విట్టర్‌లో ఆరోపించారు.  

రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు మరో కేసు తనపై నమోదు చేశారని ఆరోపించారు. అయినా తాను కోర్టుకు హాజరవుతానని న్యాయస్థానంలోనే వారితో తేల్చుుకుంటానని తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు తనను వేధిస్తున్నాయని ఆరోపించారు. భయపెడుతున్నాయంటూ సంచలన వ్యాక్యలు చేశారు. అయినా వారి బెదిరింపులకు భయపడపోనని సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.