ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ కి చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో ఈ టోర్నీ ముగియనుంది. ఈ నేపథ్యంలో... టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి వరల్డ్ కప్ అని. ఆ తర్వాత ఆయన రిటైర్ అవుతారనే వాదనలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

ఇప్పటికే అంబటి రాయుడు తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు. పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్, దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ లు ఆటకు వీడ్కోలు పలికారు. ఈ జాబితాలో ధోనీ కూడా చేరబోతున్నాడంటూ వార్తలు వెలువడుతున్నాయి. కాగా దీనిపై ధోనీ స్పందించారు.

శ్రీలంకతో నేడు కోహ్లి సేన చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతున్న నేపథ్యంలో సదరు చానెల్‌ రిపోర్టర్‌ ధోని ముందు రిటైర్మెంట్‌ అంశాన్ని ప్రస్తావించగా.. తన రిటైర్మెంట్‌ గురించి తనకే తెలియదన్నాడని పేర్కొంది. ‘ నేనెప్పుడు రిటైర్‌ అవుతానో నాకే తెలియదు. కానీ చాలా మంది రేపటి మ్యాచ్‌ (శ్రీలంకతో)కు మందే వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు.’ ధోని వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.