కోహ్లీ గిల్లికజ్జాలు: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 4, 2019, 6:31 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

టీమిండియాకు షాక్: కోహ్లీపై వేలాడుతున్న నిషేధం కత్తి

బంగ్లాదేశ్ పై విజయం సాధించిన టీమిండియా సెమీ ఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచులో జరిగిన సంఘటన టీమిండియాను కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉంది.
 

 

కివీస్ ఓటమి: చిగురించిన పాకిస్తాన్ ఆశ, కానీ...

జూన్ 16వ తేదీన ఇండియాపై ఓడిపోయిన పాకిస్తాన్ ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ లపై వరుసగా విజయం సాధించి సెమీ ఫైనల్ చేరుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది. 
 

 

ఇండియా సెమీ ఫైనల్ ప్రత్యర్థిపై డైలమా: లెక్కలు ఇవీ...

ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇండియాకు, ఇంగ్లాండుకు మధ్య సెమీ ఫైనల్ జరుగుతుంది. కానీ, ఇంకా కొన్ని మ్యాచులు మిగిలి ఉన్నందున ఈ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, భారత్ స్థానాలు తర్వాతి మ్యాచుల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

 

మోహన్ బాబుకి కీలక పదవి..?

సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్ బాబుకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి అప్పగించనున్నట్లు మరోసారి వార్తలు గుప్పుమన్నాయి.

 

అంబటి రాయుడి రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ ట్వీట్

ప్రపంచ కప్ జట్టులో తనకు స్థానం దక్కుతుందని ఆశించిన అంబటి రాయుడికి నిరాశే ఎదురైంది. అతని స్థానంలో ఆల్ రౌండర్ విజయ శంకర్ ను బిసిసిఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అందుకు గల కారణాన్ని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.
 

 

నాదెండ్లకు గాలం: బిజెపి అసలు టార్గెట్ పవన్ కల్యాణ్

తన వ్యూహంలో భాగంగా బిజెపి నేతలు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావుకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. నాదెండ్ల భాస్కర్ రావు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ మాత్రం జనసేనలో కొనసాగుతున్నారు.
 

 

అప్పుడు మీరు సెటిల్ మెంట్లతో బిజీ, మాదెబ్బకు మీనాన్న గిజగిజలాడారు : జగన్ పై లోకేష్ ట్వీట్

మీ తండ్రి వైయస్ పాలనలో ఏపీలో ధనయజ్ఞం జరుగుతున్న రోజుల్లో మీరు సెటిల్ మెంట్లతో బిజీగా ఉన్నారని జగన్ పై విరుచుకుపడ్డారు. సెటిల్మెంట్లలో బిజీ కాబట్టి రాష్ట్రంలోనూ, అసెంబ్లీలోనూ ఏం జరుగుతుందో అది ఇచ్చంపల్లో, ఎల్లంపల్లో తెలుసుకునే అవకాశం లేకుండా పోయి ఉంటుందని విమర్శించారు. 
 


మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టలేదు...విజయసాయి

తాజాగా... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. చంద్రబాబు హయంలో కనీసం మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టలేదని ఆరోపించారు.
 

 

టీడీపీకి షాక్: వైసీపీలోకి అంబికా కృష్ణ సోదరుడు రాజా

అంబికా రాజా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచి పరిణామమని అన్నారు డిప్యూటీ సీఎం ఆళ్లనాని. అంబికా రాజాకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంబికా రాజా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఆర్యవైశ్య సామాజిక వర్గంలో పేదలకు ఎంతో సేవ చేశారని వారి అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. 
 

 

అప్పుడే కరెంట్ కోతలు: జగన్ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్

వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయని వైసీపీ పాలనపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు.  గురువారం నాడు అమరావతిలో పార్టీ సీనియర్లతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.
 

 

పవన్ కల్యాణ్ తో రెండు సార్లు భేటీ: అయినా తేల్చని వంగవీటి రాధా, ఆంతర్యం ఏమిటి?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 

 

టీడీపీ వీడటం బాధేసింది, కంటతడిపెట్టిన మాజీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ వీడటం చాలా బాధగా ఉందని వరదాపురం సూరి భావోద్వేగానికి గురయ్యారు. కంటతడిపెట్టారు. 2023లో జరిగే జమిలి ఎన్నికల్లో మోదీ, అమిత్ షా నాయకత్వంలో రాష్ట్రంలో కూడా బీజేపీ విజయం సాధిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  తనను నమ్ముకున్న ప్రతీ ఒక్కరికి అండగా ఉంటూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని వదాపురం సూరి స్పష్టం చేశారు. 
 

 

ఉండవల్లి ఇంటిపై చంద్రబాబు ట్విస్ట్: ఇంతకీ అది ఎవరిది?

అక్రమంగా ఎవరో నిర్మించిన భవనంలో ముఖ్యమంత్రి ఎలా నివాసం ఉంటారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ వచ్చారు. 
 

 

లోకేష్ ను అదుపులో పెట్టుకో, లేకపోతే తీవ్ర పరిణామాలు: చంద్రబాబుకు లక్ష్మీపార్వతి వార్నింగ్

లోకేష్ ను పక్కనబెడితే తప్ప టీడీపీ బాగుపడదంటూ సూచించారు. లోకేష్ నోటిని అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. లేకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. 
 

 

బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే సూరి: రంగంలోకి దిగిన బాలకృష్ణ

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో టీడీపీ నాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జీ  నియామకం కోసం  నేతలను ఆ పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది
 

 

వైసీపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు, ఈనెల 6న భారీగా చేరికలు : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

ఈ ప్రచారానికి ఊతమిస్తున్నట్లుగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని స్పష్టం చేశారు. ఈ నెల 6 నుంచి బీజేపీలో చేరికలు ప్రారంభమవుతాయని తెలిపారు. 
 

 

'రాజు గారి గది 3' నుండి తమన్నా అవుట్.. కారణమదేనా..?

 ఓ బాలీవుడ్ సినిమా కోసం తమన్నా 'రాజు గారి గది 3' సినిమా వదులుకుందని సమాచారం. నిజానికి దర్శకుడు ఓంకార్.. తమన్నాని సంప్రదించినప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆ సమయంలో వెంటనే 'రాజు గారి గది 3'కి ఓకే చెప్పేసింది.
 

బీజేపీలోకి జేసీ కుటుంబం.. ప్రభాకర్ రెడ్డి క్లారిటీ

రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ కూడా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. కాగా... జేసీ కుటుంబం కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
 

 

కాస్త జాగ్రత్తపడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు: ఓటమిపై చంద్రబాబు ఆవేదన

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాస్త జాగ్రత్తపడి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ఇలాంటి సమావేశాలు కూడా పెట్టుకునే అవకాశం ఉండేది కాదన్నారు. 

 

కూకట్ పల్లిలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పై కేసు

బాలీవుడ్‌ నటుడు హృతిక్ రోషన్‌పై హైదరాబాదులోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌ నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తూ వ్యాయామానికి స్లాట్ ఇవ్వడం లేదని శశి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

 

వైసీపీలో పదవుల పందేరం, సన్నిహితులకు కీలకపదవులు: ఫైనల్ చేసిన సీఎం జగన్

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి తెరలేపింది. నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే పలుకీలక నామినేటెడ్ పదవులకు కొందరి పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 
 

 

5ఏళ్ల బాలికను ముద్దాడిన 12ఏళ్ల బాలుడు.. రేప్ అంటూ కేసు

తనతో కలిసి రోజూ ఆడుకునే ఐదేళ్ల బాలికను ఓ 12ఏళ్ల బాలుడు ముద్దుపెట్టుకున్నాడు. కాగా... బాలికను రేప్ చేశాడంటూ.. పోలీసులు ఆ బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
 

 

నాకు ఈ భర్త వద్దు... ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య

నెలన్నర క్రితమే వారిద్దరికీ వివాహమైంది. కొద్ది రోజులపాటు దంపతులు ఇద్దరూ బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందో తెలీదు... నాకు ఈ భర్త వద్దు... నాకు ఇష్టం లేదంటూ భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 
 


అంబటి రాయుడి రిటైర్మెంట్ పై కేటీఆర్ స్పందన ఇదీ...

రత క్రికెటర్‌ రాయుడు రిటైర్మెంట్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్‌లో స్పందించారు. రాయుడు అసలైన చాంపియన్‌ అని, సెలెక్టర్లు పట్టించుకోకపోయినా క్రికెట్‌ ఫ్యాన్స్‌ రాయుడును ఎప్పటికీ మరచిపోరని ఆయన అన్నారు. రాయుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు.
 

 

నాగచైతన్య అంత కట్నం తీసుకున్నాడా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఓ బేబీ'. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత బిజీగా గడుపుతోంది.
 

 

మెగాఫ్యామిలీ కోసం ఇండస్ట్రీకి రాలేదు.. పృథ్వీ కామెంట్స్!

పృథ్వీ తను మెగాఫ్యామిలీ కోసం ఇండస్ట్రీకి రాలేదని పంచ్ లు వేశాడు. 'తాడేపల్లిగూడెం నుండి సూట్ కేస్ పట్టుకొని చెన్నైకి వెళ్లింది మెగాహీరోలు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తారని కాదు..' అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ చిరంజీవి గారిపై ఎంతో అభిమానముందని.. అతడిని స్పూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు.
 

 

అర్జున్ రెడ్డిని మించేలా అట.. చిన్నికృష్ణ ట్రాక్ లోకి వచ్చాడుగా!

తాజాగా రాకేష్ రెడ్డి రచయిత చిన్ని కృష్ణతో కలసి తిరుమలలో ఆసక్తికర ప్రకటన చేశారు. అర్జున్ రెడ్డిని మించేలా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. చిన్నికృష్ణ అద్భుతమైన కథ అందించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 

 

'సాహో' తొలి పాట.. ట్యూన్ ఎవరు చేశారో తెలుసా..?

'సైకో సయాన్' పేరుతో రాబోతున్న ఈ పాటలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఈ పాటతో 'సాహో' సినిమాకు ఎవరు మ్యూజిక్ చేస్తున్నారో క్లారిటీ వస్తుందని భావించారు. అయితే దర్శకనిర్మాతలు మాత్రం కేవలం ఒక సంగీత దర్శకుడిని పెట్టుకోకుండా ఒక్కో పాట ఒక్కొక్కరితో చేయించుకొని ఈజీగా పని పూర్తి చేసుకుంటున్నారు.
 

 

జూ.ఎన్టీఆర్ తో ఎఫైర్.. మా ఇంట్లో తెలిసింది.. అందుకే సినిమాలకు దూరం!

మర్, అభినయం పరంగా టాప్ లీగ్ లోకి చేరాల్సిన నటి సమీరా. ఎన్టీఆర్, చిరంజీవి, సూర్య లాంటి స్టార్ హీరోలతో జత కట్టింది. ఎన్టీఆర్ తో తాను ప్రేమలో ఉన్నానంటూ అప్పట్లో వచ్చిన ఊహాగానాలు తన కెరీర్ పై ప్రభావం చూపాయని సమీరా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 
 

 

'కాంప్రమైజ్'కు ఓకేనా అంటూ మెసేజ్ లు చేసేవారు.. నటి కామెంట్స్!

సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి ఇలాంటి వేధింపులు ఇంకా ఎక్కువగా ఉంటాయని ఇటీవల మీడియా ముందుకొచ్చిన కొందరు తారలు కామెంట్స్ చేశారు. తాజాగా మలయాళీ ముద్దుగుమ్మ గాయత్రి సురేష్ కాస్టింగ్ కౌచ్ పై సంచనల కామెంట్స్ చేసింది.
 


సచిన్ ప్రశ్నకు సుందర్ పిచాయ్ జవాబు... ధోని స్టైల్లో

సుందర్ తో కలిసి దిగిన ఫోటోలను సచిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ ఫోటో గురించి అభిమానులకు ఓ ప్రశ్న సంధించాడు. ''  క్యా యేహ్‌ సుందర్‌ పిక్‌ హై?(ఈ ఫోటో బావుందా?'' అని పేర్కొన్నాడు. అయితే సచిన్ ట్వీట్ పై స్పందించిన సుందర్  శోని  స్టైల్లో ఫన్నీ కామెంట్ చేశాడు.

 

 

మనస్తాపం అందుకే: అంబటి రాయుడిపై బిసిసిఐ చిన్నచూపు


బిసిసిఐ తీరుపైనే అంబటి రాయుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపిస్తున్నారు. అంబటి రాయుడు అంత తీసివేయదగ్గ ఆటగాడేమీ కాడు. అతని సగటు 47 పైచిలుకు ఉంది. ఏ క్రికెటర్ కైనా అది మంచి సగటే.
 

 

మైదానంలోకి నగ్నంగా దూసుకొచ్చిన అభిమాని.. మ్యాచ్ కి అంతరాయం

ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ కి అంతరాయం కలిగింది. ఈ సంఘటన ప్రపంచకప్ లో చోటుచేసుకుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు బుధవారం తలపడ్డాయి.

 

 

 

click me!