తనతో కలిసి రోజూ ఆడుకునే ఐదేళ్ల బాలికను ఓ 12ఏళ్ల బాలుడు ముద్దుపెట్టుకున్నాడు. కాగా... బాలికను రేప్ చేశాడంటూ.. పోలీసులు ఆ బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హబ్సిగూడకు చెందిన చిన్నారులు ఇద్దరూ ఒకే అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. కాగా ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తారు. అయితే... బాలుడి దగ్గర ఓ పిల్లి ఉంది. దానితో రోజూ ఆడుకుంటాడు. ఆ చిన్నారి కూడా అలాంటిదే ఓ పిల్లిని పెంచుకుంటోంది. దీంతో ఇద్దరూ కలిసి తమ పిల్లలుతో రోజూ ఆడుకుంటూ ఉండేవారు. 

కాగా... ఆ చిన్నారిని బాలుడు లైంగికంగా వేధించాడంటూ పక్కింటివారు బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.దీనిపై బాలుడిని ఆరా తీయగా.. తాను కేవలం బుగ్గపై ముద్దు పెట్టానని మాత్రమే చెప్పాడు. కాగా.. బాలికను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.