ఎవరి కొడుకైనా సరే: ఆకాశ్‌పై చర్యలకు బీజేపీ కసరత్తు

By Siva KodatiFirst Published Jul 4, 2019, 6:00 PM IST
Highlights

మున్సిపల్ ఉద్యోగిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఇండోర్ ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేయవచ్చని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది

మున్సిపల్ ఉద్యోగిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఇండోర్ ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేయవచ్చని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఎవరి కొడుకైనా సరే ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఉపేక్షించేంది లేదని ప్రధాని నరేంద్రమోడీ ఏకంగా కార్యకర్తల సమావేశంలో మండిపడిన సంగతి తెలిసిందే. ఆకాశ్‌పై చర్యలకు సంబంధించి మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు రాకేశ్ సింగ్‌తో ఢిల్లీ నుంచి ఓ పార్టీ సీనియర్ నేత ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీనియర్ నేత రామ్‌లాల్ సైతం రాకేశ్‌తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అధికారి పట్ల రాకేశ్ తీరుతో సీరియస్‌గా ఉన్న బీజేపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాధికారిపై దాడి కేసులో ఇప్పటికే ఆకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

click me!