Asianet News TeluguAsianet News Telugu

సచిన్ ప్రశ్నకు సుందర్ పిచాయ్ జవాబు... ధోని స్టైల్లో

భారత సంతతికి చెందిన ఎన్నారై సుందర్ పిచాయ్ అందరికీ సుపరిచితమే. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థకు సీఈవో స్థాయికి ఎదిగినా అతడు తన మూలాలను మరిచిపోలేదు. సందర్భానుసారంగా అతడు మాతృదేశం భారత్ పై ప్రేమను చూపిస్తుంటాడు. అలా అతడు తాజాగా తన బిజీ షెడ్యూల్ ను కూడా వదులుకుని కేవలం భారత జట్టు తలపడుతున్న ప్రపంచ కప్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లాడు. అక్కడ  బర్మింగ్ హామ్ వేదికన బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ను పిచాయ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి వీక్షించాడు. 

world cup 2019: google ceo reacts on sachin tweet
Author
Birmingham, First Published Jul 4, 2019, 2:55 PM IST

భారత సంతతికి చెందిన ఎన్నారై సుందర్ పిచాయ్ అందరికీ సుపరిచితమే. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థకు సీఈవో స్థాయికి ఎదిగినా అతడు తన మూలాలను మరిచిపోలేదు. సందర్భానుసారంగా అతడు మాతృదేశం భారత్ పై ప్రేమను చూపిస్తుంటాడు. అలా అతడు తాజాగా తన బిజీ షెడ్యూల్ ను కూడా వదులుకుని కేవలం భారత జట్టు తలపడుతున్న ప్రపంచ కప్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లాడు. అక్కడ  బర్మింగ్ హామ్ వేదికన బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ను పిచాయ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి వీక్షించాడు. 

ఈ సందర్భంగా సుందర్ తో కలిసి దిగిన ఫోటోలను సచిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఈ ఫోటో గురించి అభిమానులకు ఓ ప్రశ్న సంధించాడు. ''  క్యా యేహ్‌ సుందర్‌ పిక్‌ హై?(ఈ ఫోటో బావుందా?)'' అని పేర్కొన్నాడు. అయితే సచిన్ ట్వీట్ పై స్పందించిన సుందర్  శోని  స్టైల్లో ఫన్నీ కామెంట్ చేశాడు. 

''ఈ ఫోటోను మహా  భాయ్ చూస్తే ''బహుత్ బడియా''(చాలా అద్భుతంగా వుంది) అంటాడు. మీతో(సచిన్) కలిసి మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మరో ప్రపంచ కప్ వరకు ఈ అపురూపమైన జ్ఞాపకాలను పదిలంగా  దాచుకుంటా'' అంటూ పిచాయ్ కామెంట్ చేశాడు.   

సచిన్ ప్రశ్నకు క్రికెట్  ప్రియులు, నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. దీనిపై సుందర్ పిచాయ్ కూడా స్పందించడంతో మరింత వైరల్ అయ్యింది. అతడు ధోని స్టైల్లో చేసిన సరదా కామెంట్ ను అభిమానులకు నచ్చినట్లుంది.దీంతో సచిన్  ట్వీట్ తెగ వైరల్ అయ్యింది.
 
Follow Us:
Download App:
  • android
  • ios