చిత్ర పరిశ్రమలో నటీ నటుల మధ్య ఎఫైర్స్ కామన్. బాలీవుడ్ లో అయితే ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సౌత్ లో కొంతవరకు ఇది తక్కువ. హీరో హీరోయిన్ల ప్రేమ గురించి రూమర్లు వినిపిస్తే మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోతుంది. రూమర్లని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కానీ అలంటి రూమర్లే నటీ నటుల కెరీర్ పై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. 

ఆ జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది సమీరా రెడ్డి. గ్లామర్, అభినయం పరంగా టాప్ లీగ్ లోకి చేరాల్సిన నటి సమీరా. ఎన్టీఆర్, చిరంజీవి, సూర్య లాంటి స్టార్ హీరోలతో జత కట్టింది. ఎన్టీఆర్ తో తాను ప్రేమలో ఉన్నానంటూ అప్పట్లో వచ్చిన ఊహాగానాలు తన కెరీర్ పై ప్రభావం చూపాయని సమీరా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

వీరిద్దరూ నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో జంటగా నటించారు. ఎన్టీఆర్, సమీరా సన్నిహితంగా మెలగడంతో వీరిద్దరిపై ఊహాగానాలు వెలువడ్డాయి. ఎన్టీఆర్ తో తనకున్న రిలేషన్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని సమీరా అంటోంది. ఎన్టీఆర్ స్నేహితుడు కాబట్టే సన్నిహితంగా ఉన్నాను. అంతకు మించి మా మధ్య ఇంకేమి లేదు. 

జనం మా రిలేషన్ షిప్ గురించి మాట్లాడుకోవడం, మీడియాలో వార్తలు రావడంతో మా ఇంట్లో వాళ్లకు తెలిసింది. పెద్ద సమస్యగా మారుతుండడంతో టాలీవుడ్ సినిమాలకు తానే దూరమైనట్లు సమీరా రెడ్డి పేర్కొంది. ప్రస్తుతం సమీరా రెడ్డి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ముంబై కు చెందిన అక్షయ్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో సమీరా రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.