ఓంకార్ తెరకెక్కిస్తోన్న 'రాజు గారి గది 3' సినిమా కోసం ముందుగా తమన్నాని హీరోయిన్ గా అనుకున్నారు. పూజా కార్యక్రమాలకు కూడా ఆమె హాజరైంది. అయితే సడెన్ గా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెకి స్క్రిప్ట్ కొత్త వెర్షన్ నచ్చలేదని, హీరోగా అశ్విన్ కి ఎక్కువ ఎలివేట్ చేసే ఛాన్స్ ఉందని ఇలాంటి కారణాలతో ఆమె తప్పుకుందని అన్నారు.

అయితే అసలు కారణం మాత్రం అది కాదట. ఓ బాలీవుడ్ సినిమా కోసం తమన్నా 'రాజు గారి గది 3' సినిమా వదులుకుందని సమాచారం. నిజానికి దర్శకుడు ఓంకార్.. తమన్నాని సంప్రదించినప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆ సమయంలో వెంటనే 'రాజు గారి గది 3'కి ఓకే చెప్పేసింది.

కొన్ని రోజుల తరువాత ఆమెకి బాలీవుడ్ సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. నవజుద్ధీన్ సిద్ధిఖీ హీరోగా అతడి సోదరు షమాస్ ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా తమన్నాని సంప్రదించారు.

ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉండడంతో తమన్నా తెలుగు సినిమాకి హ్యాండ్ ఇచ్చేసి బాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకి 'బోలె చుడియాన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. గతంలో ఇలియానా, జెనీలియా, రకుల్ వంటి తారలు ఇలానే బాలీవుడ్ సినిమాల కోసం తెలుగు సినిమాలను వదులుకున్నారు.