కమెడియన్ పృథ్వీ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై, జనసేన పార్టీపై సంచనల కామెంట్స్ చేశారు. నాగబాబుని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండస్ట్రీలో అతడికి అవకాశాలు తగ్గాయని, మెగాఫ్యామిలీ హీరోలు తమ సినిమాల్లో పృథ్వీకి అవకాశాలు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారని, అతడిని బ్యాన్ చేశారని వార్తలు వచ్చాయి.

ఈ విషయాలపై స్పందించిన పృథ్వీ తను మెగాఫ్యామిలీ కోసం ఇండస్ట్రీకి రాలేదని పంచ్ లు వేశాడు. 'తాడేపల్లిగూడెం నుండి సూట్ కేస్ పట్టుకొని చెన్నైకి వెళ్లింది మెగాహీరోలు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తారని కాదు..' అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ చిరంజీవి గారిపై ఎంతో అభిమానముందని.. అతడిని స్పూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు.

చిరు నటిస్తోన్న 'సై రా' సినిమాలో పృథ్వీ పోర్షన్ ని ఎడిటింగ్ లో తీసేస్తారనే వార్తలు కూడా బయటకి వచ్చాయి. దీనిపై స్పందించిన పృథ్వీ.. చిరంజీవి అలా చేస్తారని అనుకోవడం  లేదని అన్నారు. 'ఖైదీ 150' సినిమాలో డైరెక్టర్ పృథ్వీ కామెడీ ఎపిసోడ్స్ ని కొన్నింటినీ తీసేయడంతో ఆ సమయంలో ఆయన బాగా హర్ట్ అయ్యారు. కొన్నిఇంటర్వ్యూలో పృథ్వీ తన ఆవేదన వ్యక్తం చేయడంతో చిరంజీవి విషయం తెలుసుకొని వెంటనే పృథ్వీకి ఫోన్ చేసి మళ్లీ ఆ సన్నివేశాలను సినిమాలో యాడ్ చేయిస్తానని చెప్పారట.

ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న పృథ్వీ 'సై రా..' విషయంలో చిరంజీవి తనపట్ల పక్షపాతం చూపరని నమ్మకంగా చెబుతూనే.. మరోపక్క అందరూ మెగాఫ్యామిలీ తనను బ్యాన్ చేసిందని అంటున్నారు కాబట్టి ఏం జరుగుతుందో తెలియదని అన్నారు.